ఇటలీలో రామ్ ‘రెడ్’ – శోభి స్టెప్స్ మామూలుగా ఉండవ్ మరి

ఇటలీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా నటిస్తున్న ‘రెడ్’ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతోంది..

  • Published By: sekhar ,Published On : February 15, 2020 / 07:55 AM IST
ఇటలీలో రామ్ ‘రెడ్’ – శోభి స్టెప్స్ మామూలుగా ఉండవ్ మరి

Updated On : February 15, 2020 / 7:55 AM IST

ఇటలీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా నటిస్తున్న ‘రెడ్’ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతోంది..

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ నాయికలు. కిశోర్‌ తిరుమల దర్శకుడు. కృష్ణ పోతినేని సమర్పకుడు. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ‘తడమ్’ సినిమాకిది తెలుగు రీమేక్.  ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుగుతోంది.

నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ : ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’ తర్వాత రామ్‌-కిశోర్‌ తిరుమల కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. గోవా, హైదరాబాద్‌, వైజాగ్‌ ప్రాంతాల్లో జరిపిన షూటింగ్‌తో టాకీ పార్ట్ పూర్తయ్యింది.

ఈ నెల 12 నుంచి ఇటలీలోని టస్క్‌, ఫ్లారెన్స్‌, డోలోమైట్స్‌ లాంటి ప్రాంతాల్లో రామ్‌, మాళవికా శర్మలపై శోభి మాస్టర్‌ కొరియోగ్రఫీలో రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 20 వరకు ఇటలీలో షెడ్యూల్‌ జరుగుతుంది.

హైదరాబాద్‌ తిరిగొచ్చాక చిత్రీకరించే పాటతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మణిశర్మ చక్కని బాణీలు అందిస్తున్నారు. ఆయన మా బ్యానర్‌లో పని చేయడం ఇదే మొదటిసారి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 9న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. 

RAM RED

RAM RED ITALY

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు