Aaradhya Devi : ఆర్జీవీ దెబ్బకి మారిపోయిన హీరోయిన్.. గ్లామర్ పాత్రలు చేస్తాను.. అప్పుడు నో చెప్పి..
గతంలో సినిమా అవకాశాలు వచ్చినా గ్లామర్ పాత్రలు చేయను అని కామెంట్స్ చేసి ఇప్పుడు పూర్తిగా గ్లామరస్ రోల్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి.

RGV Actress Aradhya Devi reply to Trollers on Glamorous Rolls
Aaradhya Devi : సోషల్ మీడియాలో చీరలతో ఫోటోషూట్స్ చేసే ఓ మలయాళీ అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్ అలియాస్ ఆరాధ్య దేవిని ఆర్జీవీ ఫేమస్ చేసి ఈమెతో సినిమా తీస్తాను అని ప్రకటించాడు. అప్పటి వరకు సాంప్రదాయంగా పద్దతిగా కేవలం చీరలతో ఫోటోషూట్స్, రీల్స్ చేసే ఆరాధ్య ఆర్జీవీ చేతిలో పడ్డాక బోల్డ్ ఫొటోషూట్స్, హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు దిగి మరింత వైరల్ అయింది.
ఇక ఆరాధ్య దేవిని ఆర్జీవీ చెప్పినట్టే శారీ అనే సినిమాని ప్రకటించి అందులో హీరోయిన్ గా చేసేసాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్, టీజర్ కూడా రిలీజవ్వగా ఇందులోనే ఆరాధ్య అందాలన్నీ చూపించేసారు. దీంతో ఈమెపై ట్రోలింగ్ మొదలైంది. గతంలో సినిమా అవకాశాలు వచ్చినా గ్లామర్ పాత్రలు చేయను అని కామెంట్స్ చేసి ఇప్పుడు పూర్తిగా గ్లామరస్ రోల్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి.
Also Read : Allu Arjun : పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
దీంతో ఆరాధ్య దేవి దీనిపై స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఆరాధ్య దేవి తన పోస్ట్ లో.. గతంలో నేను గ్లామర్ పాత్రలు చేయను అని చెప్పాను. నేను 22 ఏళ్ళ వయసులో చేసిన కామెంట్ ని ఇప్పుడు జడ్జ్ చేయను. కాలంతో పాటు మన ఆలోచనలు మారుతాయి. అలాగే మనకు జీవితం నేర్పిన పాఠాలతో మనం మారతాము. గతంలో చేసిన వ్యాఖ్యలకు నేను తప్పుగా ఫీల్ అవ్వట్లేదు. అప్పుడు నా అభిప్రాయాలు అలా ఉండేవి. గ్లామర్ అనేది పర్సనల్ ఛాయస్. ఒక నటిగా నేను ఇప్పుడు ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దమే. మంచి పాత్రలు వస్తాయని ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇప్పుడు ఆర్జీవీ సినిమా, తన మొదటి సినిమాలోనే ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ బోల్డ్ గా నటిస్తుందంటే ఇకపై సినిమాల్లో ఏ రేంజ్ లో నటిస్తుందో చూడాలి.