రాంగోపాల్ వర్మ ఆఫీస్ పై పవన్ ఫ్యాన్స్ దాడి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు,ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ మధ్య వివాదం మరింత ముదిరింది. బంజారాహిల్స్ లోని రాంగోపాల్ వర్మ ఆఫీస్ పై పవన్ ఫాన్స్ దాడి చేశారు. ఆఫీసును ఓయూ జేఏసీ విద్యార్థులు ధ్వంసం చేశారు.
ప్రవర్ స్టార్ పేరుతో ఇటీవల కొత్త సినిమా ప్రోమోను వర్మ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రవర్ స్టార్ సినిమాపై ఓయూ జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాంగోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఓయూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. దీంతో రాంగోపాల్ వర్మ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఓయూ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు తన ఇంటికి ఎవరైనా రావొచ్చని రాంగోపాల్ వర్మ తెలిపారు. తాను ఇలాంటి ఘటనలు ఎన్నో సార్లు చూశానని,ఇవేం తనకు కొత్త కాదని వర్మ తెలిపారు. చాలామంది పనిలేనోళ్ళు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుంటారని వర్మ తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ మీద సినిమా తీయలేదని చాలా ఇంటర్వ్యూ లలో క్లారిటీగా చెప్పానని,తాను ఓ కల్పిత కథతో సినిమా తీస్తున్నట్లు అయన తెలిపారు.