RGV : ఐకాన్ స్టార్ పై ప్రశంశలు కురిపించిన ఆర్జీవీ

తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించాడు. బన్నీ నుంచి ఇటీవల 'పుష్ప' సినిమా వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి.....

Rgv Allu Arjun

RGV :   సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఎప్పుడు ఎవరి మీద ఎలా ట్వీట్ చేస్తాడో ఎవ్వరికి తెలీదు. గత వారం రోజుల నుంచి ఆర్జీవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. వార్తల్లో రోజూ కనిపిస్తున్నాడు. సినిమా టికెట్ల విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్స్ , వీడియోస్ చేస్తున్నాడు. గత మూడు రోజులుగా ట్విట్టర్లో ఇదే చర్చ జరిగింది. ఒక పక్క సినిమా సమస్యల గురించి మాట్లాడుతూనే మరో పక్క సినిమాలని ప్రమోషన్స్ చేస్తున్నాడు. సినిమాలని అభినందిస్తున్నాడు.

తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించాడు. బన్నీ నుంచి ఇటీవల ‘పుష్ప’ సినిమా వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది. పుష్ప రిలీజ్ టైంకి బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా వాటన్నిటిని దాటుకొని ‘పుష్ప’ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. దీంతో ఈ విజయంపై ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

RGV vs Kodali Nani: కొడాలి నాని ఎవరో నాకు తెలీదు -రామ్ గోపాల్ వర్మ

”హే అల్లు అర్జున్… ఆంథిమ్, సత్యమేవ జయతే 2, 83 లాంటి పెద్ద సినిమాలున్నా వాటన్నింటిని వెనక్కి నెట్టి ‘పుష్ప’తో ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్ళావు. ఈ ఘనత నీకే చెందుతుంది.” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. మరి బన్నీ దీనికి రిప్లై ఇస్తాడో లేదో చూడాలి. ఇక ‘పుష్ప’ సినిమా రేపట్నుంచి అమెజాన్ ఓటీటీలో రానున్న సంగతి తెలిసిందే.