Kanatara : అవేమి చేయలేని పని కాంతారా చేస్తోంది.. కాంతారా సినిమాపై ఆర్జీవీ ట్వీట్స్..

తాజాగా కాంతారా సినిమాపై ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ''కేవలం సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్‌ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలవని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్న తరుణంలో............

Kanatara : అవేమి చేయలేని పని కాంతారా చేస్తోంది.. కాంతారా సినిమాపై ఆర్జీవీ ట్వీట్స్..

RGV Tweet on Kantara Movie

Updated On : October 18, 2022 / 8:34 AM IST

Kanatara :   రిషబ్ శెట్టి హీరోగా ఆయన సొంత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతార’. కన్నడలో ఈ సినిమా భారీ విజయం సాధించింది. KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. సెప్టెంబర్ లోనే కన్నడలో రిలీజై భారీ హిట్ కొట్టి కలెక్షన్లని సాధించింది. గత వారం తెలుగు, హిందీలో ఈ సినిమా రిలీజయి ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది.

హిందీలో కాంతారా సినిమాకి ఒక్క రోజే 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక తెలుగులో రెండు రోజుల్లోనే 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం ఆశ్చర్యం. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఎటువంటి స్టార్స్ లేకుండా, ఎలాంటిభారీ ప్రమోషన్స్ లేకుండానే కాంతారా సినిమా తెలుగులో భారీ విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేయగా బాగా లాభాలు వచ్చినట్టు తెలిపారు. ఇక ఈ సినిమా గురించి రానా, ప్రభాస్, ధనుష్.. లాంటి స్టార్ హీరోలు సైతం అభినందిస్తూ ట్వీట్స్ చేయడంతో కాంతారా మరింత పాపులర్ అయింది.

Kantara : ‘కాంతారా’ తెలుగులో కూడా ఊహించని సెన్సేషన్.. ఒక్కరోజులోనే బ్రేక్ ఈవెన్.. ఆశ్చర్యంలో టాలీవుడ్..

తాజాగా కాంతారా సినిమాపై ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ”కేవలం సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్‌ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలవని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్న తరుణంలో పేరు లేని చిన్న సినిమా కాంతారా పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొడుతోంది” అని తెలిపారు. అలాగే ట్విట్టర్లో కాంతారా సినిమా ట్రెండింగ్ లో ఉంది.