Atharva : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో లవ్ సాంగ్.. “అథర్వ” నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్‌ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Atharva : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో లవ్ సాంగ్.. “అథర్వ” నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

Ringa Ringa Rosey song released from Karthik Raju and simran choudhary movie Atharva

Updated On : May 15, 2023 / 2:29 PM IST

Ringa Ringa Rosey song : సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చే సినిమాల్లో రొమాంటిక్, లవ్ ట్రాక్ సాంగ్స్ ఎక్కువగా ఉండవు. కానీ ‘అథర్వ’ అనే చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్, సాంగ్స్ ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్యాచీ పాటను మేకర్లు విడుదల చేశారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్‌ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీచరణ్‌ పాకాల బాణీ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, జావెద్ అలీ గాత్రం అన్నీ చక్కగా కుదిరాయి. ఇక డ్యాన్స్ మాస్టర్ రాజ్ కృష్ణ కొరియోగ్రఫీ కూడా చూడచక్కగా ఉంది.

పాటను రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. ‘మేం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్‌లోనే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని తెలియజేశాం. హీరో చిన్నతనం నుండి హీరోయిన్‌ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేక పోతాడు. ఆలా తన ఫీలింగ్‌ను సినిమాలో ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ పాట ఆ సన్నివేశానికి సరిగ్గా సరిపోతుందని ఎంచుకున్నాం. శ్రీ చరణ్ ఈ పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తనకు జన్మదిన శుభాకాంక్షలు. మేం అడిగిన వెంటనే లిరిక్ రైటర్ మంచి పాట రాశాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంద’ని అన్నారు.

Ringa Ringa Rosey song released from Karthik Raju and simran choudhary movie Atharva

Atharva : అథర్వ ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

హీరో కార్తీక్ మాట్లాడుతూ.. ‘కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా నన్ను వెలుగులోకి తీసుకువచ్చిన భీమనేని శ్రీనివాస్ రావు గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రోజు మేము విడుదల చేసిన సాంగ్ ప్రేక్షకులకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు సినిమాను చాలా బాగా తీశాడు. నిర్మాత సుభాష్ కథకు ఏం కావాలో అన్నీ సమాకూర్చడమే కాకుండా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా చక్కగా నిర్మించారు’ అని అన్నారు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినా ఇందులో చాలా ఏమోషన్స్ ఉన్నాయి. నేను డ్యాన్సర్ అయినా నాకు ఇందులో ఒక్క స్టెప్ వేసే అవకాశం కూడా రాలేదు. టీం అంతా కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇలాంటి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. నా కో స్టార్ కార్తీక్ చాలా హానెస్ట్ పర్సన్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు విడుదల చేసిన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంద’ని అన్నారు. ప్రస్తుతం ఈ రింగ్ రింగ్ రోసే.. అనే పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.