Rishab Shetty : మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ను కలిసిన రిషబ్‌శెట్టి.. ‘కాంతార 2’లో నటించేది ఆయనేనా!
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి తన భార్య ప్రగతితో కలిసి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను కలిశారు.

Rishab Shetty meets iconic actor Mohanlal
Rishab Shetty-Mohanlal : కన్నడ నటుడు రిషబ్‌శెట్టి తన భార్య ప్రగతితో కలిసి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను కలిశారు. ఈ విషయాన్ని రిషబ్ శెట్టి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. లెజెండరీ నటుడిని కలవడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా..’కాంతార 2′ చిత్రం కోసమే వీరిద్దరు కలిశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా 2022లో విడుదలైన ప్రతీ చోట భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార 2 ఉంటుందనే విషయాన్ని రిషబ్ శెట్టి వెల్లడించాడు. ఈ సమయంలోనే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు అనే విషయాన్ని చెప్పాడు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనే సంగతి మాత్రం చెప్పలేదు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కాంతార 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాంతార మొదటి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో దానికి ముందు జరిగిన సంఘటనలు ఇందులో చూపించనున్నారు. ఈ చిత్రం కోసం రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram