Jithender Reddy Movie Marriage Song : మంగ్లీ పాడిన తెలంగాణ పెళ్లి పాట విన్నారా? ‘జితేందర్ రెడ్డి’ సినిమా నుంచి..

తాజాగా జితేందర్ రెడ్డి సినిమా నుంచి ఓ పెళ్లి సాంగ్ విడుదల చేశారు.

Jithender Reddy Movie Marriage Song : మంగ్లీ పాడిన తెలంగాణ పెళ్లి పాట విన్నారా? ‘జితేందర్ రెడ్డి’ సినిమా నుంచి..

Jithender Reddy Movie Marriage Song sing by Mangli Released

Updated On : April 18, 2024 / 7:07 PM IST

Jithender Reddy Movie Marriage Song : ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో 1980 కాలంలో జరిగిన రాజకీయ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా నటుడు రాకేష్ వర్రె మెయిన్ లీడ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్‌ని కలిసిన రష్యన్ సినిమా ప్రతినిధులు.. మా దేశంలో షూటింగ్స్ చేయండి అంటూ..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పెళ్లి సాంగ్ విడుదల చేశారు. ‘లచ్చిమక్క..’ అంటూ సాగే పెళ్లి బ్యాక్ డ్రాప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని రాంబాబు గోసాల రాయగా గోపి సుందర్ సంగీతంలో మంగ్లీ పాడింది. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలా ఈ సాంగ్ ని చూపించనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ఈ పెళ్లి పాట ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పెళ్లి పాట మీరు కూడా వినేయండి.

ఇక ఈ జితేందర్ రెడ్డి సినిమా మే 3న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఎన్నికల ముందు పొలిటికల్ డ్రామా సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.