Chiranjeevi : మెగాస్టార్‌ని కలిసిన రష్యన్ సినిమా ప్రతినిధులు.. మా దేశంలో షూటింగ్స్ చేయండి అంటూ..

తాజాగా రష్యా నుంచి కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ మాస్కో ప్రతినిధులు హైదరాబాద్ రాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

Chiranjeevi : మెగాస్టార్‌ని కలిసిన రష్యన్ సినిమా ప్రతినిధులు.. మా దేశంలో షూటింగ్స్ చేయండి అంటూ..

Culture Ministry of Moscow Delegates Meets Megastar Chiranjeevi Video Photos goes Viral

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ని మూడు దశాబ్దాలు ఏలిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ చూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ సినిమాపై అన్ని దేశాల ప్రేక్షకులకు, సినీ పరిశ్రమలకు ఆసక్తి ఏర్పడింది. పుష్ప సినిమా రష్యాలో కూడా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు. తాజాగా రష్యా నుంచి కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ మాస్కో ప్రతినిధులు హైదరాబాద్ రాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

మాస్కో గవర్నమెంట్ సినిమా అడ్వైజర్ జూలియా గౌల్బెవ, మాస్కో క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ హెడ్ ఏకటెర్నియా చెర్కర్, యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియా.. మరికొంతమంది రష్యన్ ప్రతినిధులు చిరంజీవిని నేడు సాయంత్రం కలిశారు. చిరంజీవితో సినిమాల గురించి, టాలీవుడ్ గురించి చర్చించారు. అలాగే రష్యా క్రియేటివ్ ఇండస్ట్రీ తెలుగు సినిమాల మీద ఆసక్తిగా ఉందని, రష్యాకు వచ్చి సినిమా షూటింగ్స్ చేయమని, రష్యా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అని, రష్యా – టాలీవుడ్ సినీ పరిశ్రమల మధ్య మంచి అనుబంధం ఏర్పడాలని తెలిపారు రష్యన్ ప్రతినిధులు.

Also Read : Pottel Teaser : అనన్య నాగళ్ళ ‘పొట్టేల్’ టీజర్ చూశారా? అదిరిపోయింది.. మంచి రా&రస్టిక్ కంటెంట్..

దీనికి చిరంజీవి కూడా సహకరిస్తామని తెలిపినట్టు సమాచారం. దీంతో రష్యన్ ప్రతినిధులు వచ్చి చిరంజీవిని కలవడం, టాలీవుడ్ సినిమాలపై ఆసక్తి ఉందని చెప్పడం, మనల్ని అక్కడికి వచ్చి షూటింగ్ చేయమనడంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఇక రష్యన్ ప్రతినిధులు చిరంజీవిని కలిసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Culture Ministry of Moscow Delegates Meets Megastar Chiranjeevi Video Photos goes Viral

Culture Ministry of Moscow Delegates Meets Megastar Chiranjeevi Video Photos goes Viral