Pottel Teaser : అనన్య నాగళ్ళ ‘పొట్టేల్’ టీజర్ చూశారా? అదిరిపోయింది.. మంచి రా&రస్టిక్ కంటెంట్..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి పొట్టేల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

Pottel Teaser : అనన్య నాగళ్ళ ‘పొట్టేల్’ టీజర్ చూశారా? అదిరిపోయింది.. మంచి రా&రస్టిక్ కంటెంట్..

Ananya Nagalla Pottel Movie Teaser Released

Updated On : April 18, 2024 / 6:37 PM IST

Pottel Teaser : యువచంద్ర, అనన్య నాగళ్ళ(Ananya Nagalla) జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పొట్టేల్. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సాంగ్స్, గ్లింప్స్, ప్రమోషన్స్ తో మంచి బజ్ తెచ్చుకున్న పొట్టేల్ సినిమా నుంచి తాజాగా నేడు టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి పొట్టేల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

ఇక ఈ టీజర్ చూస్తుంటే చాలా రా & రస్టిక్ గా ఉంది. ఒక పల్లెటూళ్ళో జరిగే కథలా, ఒక ఫ్యామిలీని ఊరంతా కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు, అలాగే పేద, ధనిక బేధం కూడా చూపిస్తూ, కథలో పొట్టేలు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు, కొత్త పాయింట్ తో పొట్టేల్ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పొట్టేల్ టీజర్ ట్రెండింగ్ లో ఉంది.

Also Read : Anjana Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ రెండో కూతుర్ని చూశారా? హీరోయిన్ లెవెల్..