త్వరలో కొలుకొంటాను : రిషీ కపూర్ హెల్త్ కండీషన్

  • Published By: madhu ,Published On : January 27, 2019 / 10:31 AM IST
త్వరలో కొలుకొంటాను : రిషీ కపూర్ హెల్త్ కండీషన్

Updated On : January 27, 2019 / 10:31 AM IST

ముంబై : అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ చికిత్స నిమిత్తం కొన్ని నెలల క్రితం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తనకు జరుగుతున్న చికిత్స గురించి మొదటిసారి స్పందించారు. ఎలాంటి సమస్యలు లేకుండా తన చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ‘త్వరలో కోలుకుంటాను. నాకు చికిత్స కొనసాగుతోంది. దేవుడి దయతో త్వరగా తిరిగొస్తానన్న నమ్మకం నాకుంది. ఈ చికిత్స చేయించుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే చికిత్స పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. దురదృష్టం ఏంటంటే నాకు అంత ఓపిక లేదు. ఇప్పుడైతే నేను సినిమాల గురించి ఆలోచించడంలేదు. నాకు మానసికంగా విశ్రాంతి అవసరం. ఈ చికిత్స నాకో థెరపీ లాంటిది’ అని వెల్లడించారు రిషి.