Rithu Chowdary : వాళ్ళే విక్టిమ్ కార్డు వాడితే కష్టంగా ఉంది.. షోలో ఎమోషనల్ అయిన రీతూ.. డీమన్ పవన్ పై కామెంట్స్..
తాజాగా రీతూ చౌదరి చెఫ్ మంత్ర షోలో డీమన్ పవన్ పేరు తీసుకురాకుండా దీనిపై స్పందిస్తూ ఎమోషనల్ అయింది.(Rithu Chowdary)
Rithu Chowdary
Rithu Chowdary : బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డిమాన్ పవన్, నటి రీతూ చౌదరి. ఈ ఇద్దరూ లవర్స్ అన్న రేంజ్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేసారు. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం డీమన్ పవన్.. మేమిద్దరం విడిపోయాం. ఒకప్పుడు మంచి రిలేషన్ ఉండేది. గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. ప్రతిసారీ నేనే అర్థం చేసుకుని సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఆమె నన్ను వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లో బ్లాక్ చేసి, స్నాప్‌లో తొలగించింది అంటూ రీతూ పై ఆరోపణలు చేస్తూ పోస్ట్ పెట్టాడు.
దీనికి రీతూ కూడా తన సోషల్ మీడియా ద్వారా తప్పు చేసి విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడు అంటూ కౌంటర్లు వేసింది. తాజాగా రీతూ చౌదరి చెఫ్ మంత్ర షోలో డీమన్ పవన్ పేరు తీసుకురాకుండా దీనిపై స్పందిస్తూ ఎమోషనల్ అయింది.
రీతూ చౌదరి మాట్లాడుతూ.. ఒక రిలేషన్ షిప్ బ్రేకప్ కంటే ఫ్రెండ్షిప్ బ్రేకప్ చాలా పెయిన్ ఫుల్. ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళే విక్టిమ్ కార్డు, ఒక సింపతీ కార్డు ప్లే చేస్తే తీసుకోలేకపోయాను. తీసుకోడానికే కష్టంగా అనిపించింది. వంద సార్లు ఒక అబ్బాయి కోసం స్టాండ్ తీసుకొని వందమంది ముందు అతని కోసం మాట్లాడినప్పుడు మాత్రం ఒక్కటీ కనిపించదు. చిన్న మిస్టేక్ చేస్తే ఆ అమ్మాయి తప్పు. ఆ అమ్మాయి అదే అని అంటారు. నేను ఒక మనిషినే, నాకు బాధ ఉంటుంది. రాత్రి పూట నిద్ర కూడా పట్టట్లేదు. స్ట్రాంగ్ గర్ల్ గా ఉండి ఉండి చాలా అలసిపోయాను. నా వాళ్ళ అవ్వట్లేదు అంటూ ఎమోషనల్ అయింది.
దీంతో షోలో ఉన్న విష్ణుప్రియ సుమ, నందిని రెడ్డి ఆమెని ఓదార్చారు. రీతూ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా మరి దీనిపై డీమన్ పవన్ కానీ అతని అనుచరులు కానీ స్పందిస్తారేమో చూడాలి.
Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బైక్ రేసింగ్.. మోకాళ్ళు కొట్టుకుపోయి..
