Rithu Chowdary : అవును నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను.. కానీ.. అందులో నేను సంపాదించింది ఎంతంటే..?
రీతూ చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడింది.

Rithu Chowdary Gives Clarity on her Betting Apps Promotions and Income
Rithu Chowdary : జబర్దస్త్, పలు టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి ప్రస్తుతం టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. రీతూ చౌదరి అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో రీతూ చౌదరి పేరు కూడా వచ్చింది. రీతూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో ఈ విషయంలో పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లి వచ్చింది.
తాజాగా రీతూ చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడింది.
రీతూ చౌదరి మాట్లాడుతూ.. నేను ప్రమోషన్ చేయలేదు అని చెప్పను. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాను. కానీ చేసింది ఎన్ని అనేది చూడాలిగా. నేను చాలా ప్రమోట్ చేసినట్టు ఇష్టమొచ్చినట్టు రాయద్దు. దాని గురించి తెలియనప్పుడు నేను చేశాను. తెలిసాక చెయ్యలేదు. తప్పు అని తెలియనప్పుడు చేసాను. నేను ఒక రెండిటికి మాత్రమే ప్రమోట్ చేశాను. అన్ని చోట్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇంక తప్పు అని నాకెలా తెలుస్తుంది. తెలిసాక నేను చేసింది తప్పు అని వీడియో కూడా పెట్టాను, మళ్ళీ ఎవరూ చేయొద్దు అని చెప్పాను. సిరి హన్మంత్ మీద అయితే మరీ ఎక్కువ తప్పుగా ప్రమోట్ చేసారు. బెట్టింగ్ యాప్స్ లో లక్షలు, కోట్లు ఏమి ఇవ్వరు. మధ్యలో చాలా మంది ఉంటారు. ఆ ప్రమోషన్ నా దగ్గరకు వచ్చేసరికి ఒక్కో వీడియోకు 50 వేలు, 60 వేలకు మించి రాదు అని తెలిపింది.
Also Read : Rithu Chowdary : 700 కోట్ల స్కామ్ పై ‘రీతూ చౌదరి’ కామెంట్స్.. YS జగన్ పేరుని ప్రస్తావిస్తూ..