Samantha : పాత విగ్రహం పక్కన పెట్టి.. పుట్టినరోజుకి సమంతకు కొత్త విగ్రహం పెట్టిన అభిమాని.. అప్పుడు ట్రోల్స్.. ఇప్పుడేమంటారో..
నేడు సమంత పుట్టిన రోజు కావడంతో

Samantha Birthday Fan Establish New Idol of Samantha in her Temple
Samantha : నేడు సమంత పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. వీరాభిమానులు సినిమా వాళ్లకు టెంపుల్స్ కడతారని తెలిసిందే. ఇప్పటికే చాలా మంది హీరోలకు, హీరోయిన్స్ కి టెంపుల్స్ కట్టారు అభిమానులు.
ఇదే కోవలో ఓ మూడేళ్ళ క్రితం బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో తెనాలి సందీప్ అనే ఓ అభిమాని సమంతకు గుడి కట్టాడు. సమంత చిన్న విగ్రహం పెట్టాడు. అయితే అది సమంత విగ్రహంలా లేదని అప్పట్లో బాగా ట్రోల్ చేసారు. మళ్ళీ మూడేళ్ళ తర్వాత ఆ అభిమాని మరోసారి వైరల్ అవుతున్నాడు.
Also Read : #Single : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ వచ్చేసింది.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ అదరగొట్టారుగా..
నేడు సమంత పుట్టిన రోజు కావడంతో పాత విగ్రహాన్ని పక్కన పెట్టి సమంత కొత్త విగ్రహాన్ని ఆ గుడిలో పెట్టాడు. ఇది బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది. ఈ విగ్రహం పెట్టి కేక్ కట్ చేసి పలువురు అనాధలకు, వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించాడు. గత మూడేళ్ళుగా సమంత పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాని అని, ఆమె చేసే సేవా కార్యక్రమాలు ఇష్టమని, అందుకే ఆమెకి అభిమానిగా మారి గుడి కట్టాను అని, సమంత నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని చెప్పుకొచ్చాడు అభిమాని. మరి ఈ కొత్త విగ్రహం సంగతి సమంత వరకు వెళ్లి ఆమె స్పందిస్తుందో లేదో చూడాలి.
Also Read : Baahubali : టాలీవుడ్ చరిత్రని మార్చేసిన సినిమా రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?