Anbe Diana : రోజా రీ ఎంట్రీ ఇచ్చిన తమిళ సినిమా ఓటీటీలో.. తెలుగులో కూడా చూసేయొచ్చు..
అన్బే డయానా తమిళ్ లో జులైలో థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.(Anbe Diana)
Anbe Diana
Anbe Diana : పరి ఎలవళగన్, రమ్య రంగనాథన్ జంటగా తెరకెక్కిన సినిమా అన్బే డయానా. ఈ సినిమాలో రోజా సెల్వమణి కీలక పాత్రలో నటించింది. మిలియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాసిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ నిర్మాణంలో పరి ఎలవళగన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అన్బే డయానా తమిళ్ లో జులైలో థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Also Read : Bigg Boss 10 : బిగ్ బాస్ సీజన్ 10 టెలికాస్ట్ డేట్ అనౌన్స్.. ఎప్పట్నించి అంటే.. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు?
అన్బే డయానా సినిమా ప్రస్తుతం సోని లివ్ ఓటీటీలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. చెన్నైలో సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడు స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో ప్రేమలో పడితే ఏం జరిగింది? ఈ రెండు కుటుంబాల కలయికతో ఏం జరిగింది అనే కథాంశంతో ప్రేమ, కామెడీ, కుటుంబ బంధాల ఎమోషన్ ని చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో రోజా హీరో తల్లి పాత్రలో నటించి మెప్పించింది.
