VD11 Movie: రౌడీ దూకుడు.. శివతో సినిమా స్టోరీ ఇదేనా?

విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేశాడు. మొన్నీమధ్యవరకూ లైగర్ సినిమా షూట్ తో బిజీగా ఉన్న విజయ్.. ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా జనగణమన మూవీ మొదలుపెట్టేశాడు.

VD11 Movie: రౌడీ దూకుడు.. శివతో సినిమా స్టోరీ ఇదేనా?

Vijay Devarakonda New Movie Launch

Updated On : April 22, 2022 / 10:10 AM IST

VD11 Movie: విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేశాడు. మొన్నీమధ్యవరకూ లైగర్ సినిమా షూట్ తో బిజీగా ఉన్న విజయ్.. ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా జనగణమన మూవీ మొదలుపెట్టేశాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే గ్యాప్ లోనే శివనిర్వాణతో మరో సినిమా పట్టాలెక్కించేశాడు. సౌత్ స్టార్ హీరోయిన్ ని రిపీట్ చేస్తున్న విజయ్.. శివనిర్వాణతో ఎలాంటి స్టోరీ తెరకెక్కించబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.

Vijay Devarakonda: శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-సమంత మూవీ లాంఛ్

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఎప్పటి నుంచో సినిమా కోసం వెయిట్ చేస్తున్న శివనిర్వాణ.. పైనల్లీ సినిమా స్టార్ట్ చేశారు. లైగర్ కంటే ముందే శివనిర్వాణతో సినిమా అనుకున్నా.. సడెన్ గా పూరీతో లైగర్ ని తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు లైగర్ కంప్లీట్ అవ్వడంతో విజయ్ సినిమాల స్పీడ్ పెంచేశాడు. జనగణమనతో పాటు శివనిర్వాణతో మోస్ట్ అవెయింటింగ్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టేశాడు.

Vijay Devarakonda: సెట్స్ మీదకి శివ నిర్వాణ సినిమా.. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్‌లో కథ!

శివనిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ గా మొదలైంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ శుక్రవారం నుంచే మొదలుపెడుతున్నారు. నిన్నుకోరి, మజిలీ లాంటి లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ అయిన శివనిర్వాణ.. విజయ్, సమంత కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కాశ్మీర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తోంది. కశ్మీర్ తర్వాత హైదరాబాద్, వైజాగ్, అలెప్పీలో బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది.

Vijay Devarakonda: జనగణమన అంటూ యుద్ధంలోకి దూకిన దేవరకొండ

మణిరత్నం ఆల్ టైమ్ సూపర్ హిట్ రోజా సినిమా జానర్ లో ఉండే ఈ క్రేజీ మూవీలో విజయ్.. ఆర్మీ ఆఫీసర్ గా, సమంత కాశ్మీరీ అమ్మాయిగా కనిపించబోతుందని టాక్. గీత గోవిందం లాంటి లవ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాతో మరోసారి విజయ్ మ్యాజిక్ చేస్తాడంటున్నారు టీమ్. అంతేకాదు.. సమంత, విజయ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ కావడంతో ఈసినిమా మీద ఇప్పటినుంచే బజ్ క్రియేట్ అవుతోంది.