RRR రికార్డులు స్టార్ట్.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎంతంటే!..

  • Published By: sekhar ,Published On : October 13, 2020 / 11:03 PM IST
RRR రికార్డులు స్టార్ట్.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎంతంటే!..

Updated On : October 13, 2020 / 11:18 PM IST

RRR – Digital and Satellite Rights: యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా.. ‘‘RRR – రౌద్రం రణం రుధిరం’’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో, స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైన సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు అక్టోబర్ 22న తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన వీడియో విడుదల చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ రికార్డులు సెట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ఓ ప్రముఖ ఛానెల్ రూ.200 కోట్లకు సొంతం చేసుకుందట.


తెలుగులో ఇప్పటివరకు హైయ్యెస్ట్ అంటే రెబల్‌స్టార్ ప్రభాస్ ‘సాహో’ సినిమానే. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ దాదాపు రూ.150 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన RRR రికార్డ్ రేటుకే అమ్ముడైందని చెప్పాలి. కాగా ఈ విషయంపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిఉంది.