RRR: ఎన్టీఆర్ చేతికి ఆర్ఆర్ఆర్ ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్, మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి దశలో ఉంది. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.

Rrr
RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్, మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి దశలో ఉంది. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్, హీరోయిన్ ఒలీవియా మోరీస్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
అయితే దర్శకుడితో పాటు స్పెషల్ ప్రమోషన్ టీం తరచూ ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. సహజంగా అన్ని సినిమాలను నిర్మాణ సంస్థలు, దర్శకుడు, హీరో, హీరోయిన్ల సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే ప్రేక్షకులకు సినిమాలపై అప్ డేట్స్ ఇస్తుంటారు. కానీ.. ఆర్ఆర్ఆర్ క్రేజీ, భారీ ప్రాజెక్ట్ కావడంతో జెన్యూన్ అప్ డేట్స్ కోసం సినిమా పేరుతోనే సోషల్ మీడియా ఖాతాలు తెరిచి వాటి ద్వారానే ఇస్తున్నారు.
ప్రమోషన్, అప్ డేట్స్ కోసం రూపొందించిన ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వచ్చింది. ఆగస్ట్ 9 వ తేదీ నుండి ఎన్టీఆర్ ఇన్ స్టా ఖాతాను స్వాధీనం చేసుకోనున్నట్లు.. చిత్ర యూనిట్ అదే హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే పలు అప్డేట్స్ ను ఇస్తూ అభిమానులను అలరిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ అకౌంట్ ఎన్టీఆర్ చేతికి పోవడంతో.. ఎన్టీఆర్ దాన్ని ఎలా ఉపయోగించనున్నాడని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
View this post on Instagram