RRR : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్.. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా RRR
తాజాగా సోమవారం సాయంత్రం ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ లో RRR సినిమా 2022 సంవత్సరానికి గాను..............

RRR Movie won film of the year 2022 in Dadasaheb Phalke International Film Festival Awards
RRR : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా RRR ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా భారీ విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ ని కూడా భారీగా తెచ్చిపెట్ట్టింది. ఇక గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకుంటుంది RRR సినిమా. ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవల్లో లెక్కలేనన్ని అవార్డులు అందుకుంటుంది RRR. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఇక నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ కు అధికారికంగా నామినేట్ అయి మరో చరిత్రని సృష్టించింది RRR సినిమా.
ఇలా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను గెలుచుకుంటున్న RRR సినిమా ఇక మన దేశంలో కూడా అవార్డుల వేట మొదలుపెట్టింది. మన దేశంలో సినీ పరిశ్రమలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఒకటి. తాజాగా సోమవారం సాయంత్రం ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ లో RRR సినిమా 2022 సంవత్సరానికి గాను ఏకంగా ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది.
#DPIFF2023 : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 పూర్తి సమాచారం..
దీంతో చిత్రయూనిట్ తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో త్వరలో నిర్వహించే మరిన్ని సినిమా ఈవెంట్స్ లో కూడా RRR సినిమా పలు అవార్డులను గెలుచుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.