RRR సర్‌ప్రైజ్ ఎప్పుడంటే..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అప్‌డేట్స్ మార్చి నుంచి ప్రారంభం..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అప్‌డేట్స్ మార్చి నుంచి ప్రారంభం..
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లీకేజీ వార్తలు తప్ప ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వలేదు చిత్రబృందం.
తారక్, చరణ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా చిత్రబృందాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ‘ఆర్ఆర్ఆర్’ పేజీని ట్యాగ్ చేస్తూ ‘అప్‌డేట్స్ ఇంకెప్పుడు ఇస్తావు’ అంటూ కోపంగా ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు.
దీనికి స్పందించిన చిత్రబృందం ‘‘మార్చి నుంచి’’ అని సమాధానం ఇచ్చింది. మార్చి 27వ తేదీన రామ్‌చరణ్ పుట్టినరోజు.. ఆ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ లో చెర్రీ ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. మరి, చిత్రబృందం చేసిన తాజా ట్వీట్‌ని బట్టి చూస్తే ఆ వార్తలు నిజమయ్యేలాగే ఉన్నాయి. అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ‘RRR’ 2021 జనవరి 8న పది భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.