చలికి వణుకుతున్న RRR టీమ్

  • Published By: sekhar ,Published On : November 17, 2020 / 12:23 PM IST
చలికి వణుకుతున్న RRR టీమ్

Updated On : November 17, 2020 / 12:37 PM IST

RRR Night Shooting: యంగ్ టైగర్ NTR కొమరం భీం, మెగా పవర్‌స్టార్ Ram Charan అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తుండగా.. స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘‘RRR- రౌద్రం రణం రుధిరం’’..Imageఅసలే గజగజ వణికించే చలికాలం.. అందులో రాత్రిపూట షూటింగ్.. ఇక తమ పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ వీడియో షేర్ చేసింది. అందరూ చలికి వణికిపోతూ.. వేడి మంటల వద్ద చలికాచుకుంటున్నారు. సెట్‌లో హీటర్స్‌ని కూడా ఏర్పాటు చేయడంతో.. షాట్ గ్యాప్‌లో హీటర్ వద్దకి వచ్చి వేడినింపుకుంటున్నారు.


వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా.. మా టీమ్ పని చేయడం మాత్రం ఆపదు అని తెలిపేలా ఉన్న ఈ ఆర్ఆర్ఆర్ టీం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



https://10tv.in/superstar-mahesh-babu-is-looking-handsome/
అజయ్ దేవ్‌గన్, అలియా భట్, సముద్రఖని, ఒలీవియా మోరిస్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి, కెమెరా : సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్.