HER Movie Review : HER మూవీ రివ్యూ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అదరగొట్టిన రుహాణి శర్మ..
హాణి తాజాగా మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో HER అనే సినిమాతో నేడు జులై 21న ప్రేక్షకుల ముందుకి వచ్చింది రుహాణి శర్మ.

Ruhani Sharma first female oriented Movie HER Review Ruhani Impressed with Police Officer Character
HER Movie Review : చిలసౌ, హిట్.. లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది రుహాణి శర్మ(Ruhani Sharma). డిఫరెంట్ సినిమాలు చేస్తున్న రుహాణి తాజాగా మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో HER అనే సినిమాతో నేడు జులై 21న ప్రేక్షకుల ముందుకి వచ్చింది రుహాణి శర్మ. కొత్త దర్శకుడు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు.
HER మూవీలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. HER సినిమా కథ విషయానికి వస్తే రుహాణి శర్మ ACPగా పని చేస్తుంది. ఒకసారి రెండు మర్డర్స్ జరగడంతో ఆ కేసు రుహాణి చేతికి వస్తుంది. రుహాణి ఆ కేసుని ఎలా డీల్ చేసింది, ఆ మర్డర్స్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు అని ఎలా కనిపెట్టింది అనేది కథ. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా ఈ సినిమా సాగుతుంది. ఆ మర్డర్స్ కి రుహాణి గతంలో డీల్ చేసిన మరో కేసుకు, అలాగే ఇంకో పోలీస్ డీల్ చేసిన కేసుకి సంబంధం ఉందని తెలియడంతో సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది.
పోలీసాఫీసర్ గా రుహాణి శర్మ అదరగొట్టేసింది. ఓ పక్క సీరియస్ పోలీసాఫీసర్ గా నటిస్తూనే, ఫ్లాష్ బ్యాక్ లో లవ్ ఎపిసోడ్ లో క్యూట్ గా కూడా అలరించింది. సినిమాలో జీవన్ కుమార్ కామెడీ బాగుంటుంది. సస్పెన్స్ అంశాలు మెప్పిస్తాయి. ఇంటర్వెల్ బ్యాగ్ మంచి సస్పెన్స్ ఇచ్చి తర్వాత ఏం జరుగుతుందో అని ప్రేక్షకులని వెయిట్ చేయించేలా చేస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మ్యూజిక్, BGM సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి. ఇక క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి కూడా లీడ్ ఇచ్చారు.
Prabhas : ఈ సినిమాలో నేనొక కమెడియన్‌ని.. ప్రాజెక్ట్ K సినిమాపై హాలీవుడ్ మీడియాతో ప్రభాస్ వ్యాఖ్యలు..
సినిమా స్క్రీన్ ప్లే మాత్రం కొద్దిగా మైనస్ అవుతుంది. కథ ముందుకి, పాస్ట్ లోకి వెళ్తూ వస్తూ ఉంటుంది. దీంతో సినిమాని సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే కొన్ని సీన్స్ లో కన్ఫ్యూజ్ తప్పదు. ఓవరాల్ గా సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సినిమాతో రుహాణికి కొత్త అవకాశాలు వస్తాయని భావించొచ్చు.