‘రూలర్’ సెన్సార్ పూర్తి – ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది..

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రూలర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బాలయ్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనుండగా వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు.. ప్రకాష్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా కీలకపాత్రలు పోషించారు.
‘రూలర్’ పాటలకీ, ట్రైలర్స్‌కీ రెస్పాన్స్ బాగుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలో మంచి మెసేజ్‌తో పాటు బాలయ్య నుండి ఆయన అభిమానులూ, ప్రేక్షకులూ కోరుకునే అన్ని అంశాలూ ఉన్నాయని, ఒక్కమాటలో చెప్పాలంటే ‘రూలర్’ బాలయ్య ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని సెన్సార్ బృందం తెలిపారని సమాచారం.
Read Also : ‘రూలర్’ – బాలయ్య ఫ్యాన్సా మజాకా!
ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. బాలయ్య, వేదిక, సోనాల్ చౌహాన్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది. సంగీతం : చిరంతన్ భట్, కెమెరా : సి.రామ్ ప్రసాద్, నిర్మాత : సి.కళ్యాణ్.