భూపతితో బెల్లంకొండ సినిమా

ఆర్ఎక్స్ 100తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా

  • Published By: sekhar ,Published On : January 3, 2019 / 12:39 PM IST
భూపతితో బెల్లంకొండ సినిమా

Updated On : January 3, 2019 / 12:39 PM IST

ఆర్ఎక్స్ 100తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అల్లుడు శీనుతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అది యావరేజ్ అనుకుంటే, బోయపాటితో చేసిన జయజానకి నాయక కాస్త బెటర్. ప్రతి సినిమాలోనూ తన కంటే టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్స్ మీద పెట్టే శ్రద్ధ, కథల మీద పెట్టడం లేదని బోలెడన్ని విమర్శలొచ్చాయి. సాక్ష్యం, కవచం సినిమాలు మనోడికి ఊహించని షాక్‌నిచ్చాయి. 

ఈ రోజు తన బర్త్‌డే సందర్భంగా, మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసాడు. వాటిలో ఒకటి రమేష్ వర్మది అయితే, రెండవది, ఆర్ఎక్స్ 100తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతితో కావడం విశేషం. అజయ్, తన తర్వాతి సినిమాని ఒక పెద్ద హీరోతో చేస్తాడనే వార్తలొచ్చాయి కానీ, సడెన్‌గా బెల్లంకొండతో సినిమా అని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. 

ఈ సినిమా ఏ జానర్‌లో రూపొందబోతోందనే విషయం తెలియదు. ప్రస్తుతం తేజ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న శ్రీను, కొత్త సంవత్సరంలో, రెండు కొత్త సినిమాలను ప్రకటించాడు. ఈ లెక్కన ఈ ఏడాది ముచ్చటగా మూడు బొమ్మలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చెయ్యబోతున్నాడు. కొత్త ప్రాజెక్ట్‌లతో అయినా శ్రీను కెరీర్ గాడిన పడుతుందేమో చూడాలి మరి.