Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతలకు చేసే మేలు ఎవరికీ తెలియదు.. శబరి నిర్మాత వ్యాఖ్యలు
వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలు చేసేటప్పుడు ఖర్చు విషయంలో నిర్మాతలకు చాలా మేలు చేసేలా..

Sabari movie producer comments about Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar : నెగిటివ్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ రోల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ‘శబరి’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కొత్త దర్శకుడు అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 3న సినిమా విడుదల అవుతుండడంతో ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “వరలక్ష్మి వల్లే శబరి సినిమాని ఓకే చేసినట్లు చెప్పుకొచ్చారు. మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్న వరలక్ష్మి గారు ఈ సినిమాకి ఓకే చెప్పినప్పుడే నాకు ఈ సినిమా కథ పై పూర్తి నమ్మకం కుదిరింది. నిర్మాతగా నాకు ఇది మొదటి సినిమా. ప్రొడక్షన్ గురించి నాకు పెద్దగా తెలియదు. అది అలుసా తీసుకోని ఆమె ఎప్పుడు దీనికి ఖర్చు చేయమని అడగలేదు. ఒకవేళ మేము ఏదైనా ఎక్కువ ఖర్చు చేస్తుంటే.. ఆమె వద్దు అంటూ చెప్పేవారు. నిర్మాతలకు ఆమె చేసే మేలు ఎవరికీ తెలియదు” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Vishal : విశాల్‌నే పెళ్లి చేసుకుంటా అంటూ యాంకర్.. సిగ్గుతో ఇబ్బందిపడిన హీరో..
మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు, అన్ని సినిమాల్లో చూసిన మదర్ అండ్ డాటర్ ఎమోషన్ కంటే డిఫరెంట్ గా ఈ సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా ఐదు భాషల్లో తామే ఓన్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ మూవీ తరువాత వరుణ్ సందేశ్ తో తన రెండో సినిమా చేస్తున్నట్లు, అలాగే బిగ్ బాస్ అమర్ దీప్, సురేఖా వాణి కుమార్తె సుప్రీత జంటగా మూడో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.