జనసేన గెలుపు కోసం: మెగా అల్లుడు పూజలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన మెగా హీరోలు.. వివిధ సంధర్భాల్లో తమ మద్దతును సోషల్ మీడియా ద్వారా.. మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన మెగా హీరోలు.. వివిధ సంధర్భాల్లో తమ మద్దతును సోషల్ మీడియా ద్వారా.. మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన మెగా హీరోలు.. వివిధ సంధర్భాల్లో తమ మద్దతును సోషల్ మీడియా ద్వారా.. మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. అయితే తాజాగా మెగా హీరో.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాణిపాకం వినాయకుని సందర్శించుకుని అనంతరం జనసేన గెలుపుకు అభిమానులు కృషి చేయాలని కోరారు. కాణిపాకం వరసిద్ది వినాయకుని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన సాయిధరమ్‌తేజ్.. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని వినాయక స్వామిని వేడుకున్నట్లు వెల్లడించారు.
Read Also : బిజీ బిజీగా స్టైలీష్ స్టార్
మరోవైపు సాయి ధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘చిత్రలహరి’ విడుదలకు సిద్దం అయింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ‘చిత్రలహరి’ని నిర్మించింది. సాయిధరమ్ తేజ్‌తోపాటు ఆయన అభిమానులు ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. వరుసగా సినిమాలు ఫ్లాప్‌లు అయిన సందర్భంలో సాయి ధరమ్‌తేజ్‌కు ఈ సినిమా హిట్ ఎంతో అవసరం కూడా.
Read Also : జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారు: నారా రోహిత్