Ram Charan : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో చెప్పిన తేజ్.. కళ్ళు చాలా బాగున్నాయి..
రామ్ చరణ్ కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయో అని అందరిలో ఎంతో ఆసక్తి నెలకుంది. తాజాగా ‘క్లీంకార’కి ఎవరి పోలికలు వచ్చాయో సాయి ధరమ్ తేజ్ తెలియజేశాడు.

Sai Dharam Tej comments about Ram Charan daughter Klin Kaara
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన (Upasana) పండంటి ఆడ బిడ్డకి జన్మనించింది. పాప రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా అభిమానుల్లో కూడా ఎంతో సంతోషం నెలకుంది. ఇక ఒక సాధారణ కుటుంబంలోకే వారసుడు లేదా వారసురాలు వచ్చారు అంటే.. వాళ్ళు ఎవరి పోలికల్లో ఉన్నారో అని అందరిలో ఆసక్తి నెలకుంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ వారసురాలు అంటే మరికొంచెం ఎక్కువ ఆసక్తి ఉండడం అతిశయోక్తి కాదు.
Pawan Kalyan : మా వదిన నాకు చాలా ద్రోహం చేసింది.. దాని వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను..
ఈ క్రమంలోనే చిరంజీవి అండ్ రామ్ చరణ్ ని విలేకర్లు పాపకి ఎవరి పోలికలు వచ్చాయని గతంలోనే ప్రశ్నించారు. అప్పుడు రామ్ చరణ్.. ”నా పోలికలే వచ్చాయి” అంటూ సరదాగా మాట్లాడాడు. తాజాగా ఈ పోలిక విషయం గురించి బ్రో (Bro) మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ని ప్రశ్నించగా, తను బదులిస్తూ.. “పాపకి చాలా వరకు చరణ్ పోలికలే వచ్చాయి. కళ్ళు అయితే చాలా బాగున్నాయి” అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Varun Tej : సినిమా అయినా, రాజకీయం అయినా బాబాయ్ వెనుకే మా కుటుంబమంతా..
ఇక ఈ మెగా వారసురాలిని అభిమానాలు ఎప్పుడు చూపిస్తారా? అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ పాపకి లలితా సహస్రనామం నుంచి స్ఫూర్తి పొంది ‘క్లీంకార’ (Klin Kaara) అనే పేరుని పెట్టారు. అంతేకాదు క్లీంకార నామకరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు జాతి సంస్కృతిలో నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం ఈ మెగా వారసురాలు చిరంజీవి ఇంటిలో ఉంటూ తాతయ్య-నాయనమ్మ దగ్గర అల్లరి చేస్తూ పెరుగుతుంది.