వికలాంగుల కోసం అవెంజర్స్ స్పెషల్ షో
సాయి ధరమ్ తమకోసం అవెంజర్స్ షో వేయించనుండడంతో ఆ కిడ్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సంఘటనతో మరోసారి తన మంచి తనాన్ని చాటుకున్నాడు సాయి ధరమ్ తేజ్..

సాయి ధరమ్ తమకోసం అవెంజర్స్ షో వేయించనుండడంతో ఆ కిడ్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సంఘటనతో మరోసారి తన మంచి తనాన్ని చాటుకున్నాడు సాయి ధరమ్ తేజ్..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, దాదాపు ఆరు ఫ్లాప్‌ల తర్వాత చిత్రలహరితో కోలుకున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అని పలు సందర్భాల్లో నిరూపించుకున్న తేజు, గతంలో ఒక ఫిలిం జర్నలిస్ట్ ఆపదలో ఉంటే, రూ.లక్షల్లో ఆర్థిక సహాయం అందించాడు. వివిధ పరిస్థితులలో అభిమానులను కూడా ఆదుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు తేజు.
హైదరాబాద్ లోని ఒక ఆశ్రమానికి చెందిన కొందరు చిన్నారులు (ఫిజికల్లీ హ్యాండీకేప్డ్) తేజుని కలిసి, తమకి అవెంజర్స్ : ఎండ్ గేమ్ సినిమా చూడాలని ఉందని చెప్పగా, వెంటనే స్పందిచిన తేజు, వాళ్ళకి దగ్గర్లోని థియేటర్ లో, మే 1 న వాళ్ళ కోసం స్పెషల్ షో వేయించనున్నాడు. టికెట్స్, స్నాక్స్ ఖర్చంతా తనే పే చెయ్యబోతున్నాడు. సాయి ధరమ్ తమకోసం అవెంజర్స్ షో వేయించడంతో ఆ కిడ్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సంఘటనతో మరోసారి తన మంచి తనాన్ని చాటుకున్నాడు సాయి ధరమ్ తేజ్.