Sai Durga Tej : వరద బాధితులకు సాయి దుర్గా తేజ్ విరాళం..
వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణలతో పాటు పలువురు నటీనటులు విరాళాలను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధులకు వీటిని అందజేయనున్నట్లు తెలిపారు. తాజాగా ఈ జాబితాలో మరో హీరో చేరారు. ఆయన మరెవరో కాదు.. సాయి దుర్గా తేజ్..
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకి చెరో రూ.10లక్షలు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Fish Venkat : ఫిష్ వెంకట్‌కి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆర్థిక సాయం
‘రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు. (మొత్తం 25 లక్షలు) నా వంతు విరాళం గా ప్రకటిస్తున్నాను. ఈ కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ.’ అంటూ ట్వీట్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు.…
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 4, 2024