Fish Venkat : ఫిష్ వెంకట్‌కి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆర్థిక సాయం
ఆది మూవీలో తొడగొట్టు చిన్నా డైలాగ్‌తో గుర్తింపు తెచ్చుకుని కమెడియన్‌గా, విలన్‌గా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు ఫిష్ వెంకట్.

Producer Chadalavada Srinivasa Rao provided financial assistance to Fish Venkat
Fish Venkat : ఆది మూవీలో తొడగొట్టు చిన్నా డైలాగ్‌తో గుర్తింపు తెచ్చుకుని కమెడియన్‌గా, విలన్‌గా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు ఫిష్ వెంకట్. ప్రస్తుతం ఆయన దయనీయ స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఎంతో మందికి దానాలు చేసిన ఆయన ప్రస్తుతం చేయి చాచే స్థితిలో ఉన్నారు. ఆయనకు వైద్య, ఆర్థిక సహాయార్థం నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు లక్ష రూపాయల సాయం అందించారు.
టిఎఫ్‌పిసి ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ, టిఎఫ్‌పిసి సెక్రటరీ టి.ప్రసన్నకుమార్, దర్శకుడు కె.అజయ్ కుమార్,తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ లు చదలవాడ శ్రీనివాసరావు తరఫున ఫిష్ వెంకట్‌కు చెక్కును అందించారు.
ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ మాట్లాడుతూ.. తన కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే లక్ష రూపాయలు సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన చేసిన ఈ సాయాన్ని ఎన్నటికి మరిచిపోలేనని చెప్పుకొచ్చారు. ఇందుకు తనతో పాటు తన కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. ఆ దేవుడి ఆశీస్సులు ఆయన పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.