Sai Pallavi: సాయి పల్లవి డెడికేషన్.. ఏం చేసిందో తెలుసా?

మలయాళ భామ సాయి పల్లవి ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘‘హైబ్రిడ్ పిల్ల... ఒక్కటే పీస్’’ అనే డైలాగును తనకోసమే రాసినట్లుగా....

Sai Pallavi: సాయి పల్లవి డెడికేషన్.. ఏం చేసిందో తెలుసా?

Sai Pallavi Dedication Stuns Virata Parvam Team

Updated On : May 31, 2022 / 6:25 PM IST

Sai Pallavi: మలయాళ భామ సాయి పల్లవి ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘‘హైబ్రిడ్ పిల్ల… ఒక్కటే పీస్’’ అనే డైలాగును తనకోసమే రాసినట్లుగా మార్చేసుకుంది ఈ బ్యూటీ. తన నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం సాయి పల్లవి చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన విరాటపర్వం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sai Pallavi : ఐటెం సాంగ్స్ అస్సలు చేయను.. అలాంటి బట్టలు నాకు సెట్ అవ్వవు..

గతంలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 17న విరాటపర్వం సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమా కోసం సాయి పల్లవి చూపిన డెడికేషన్ గురించి చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల తాజాగా చెప్పుకొచ్చాడు.

Sai Pallavi : వ్యవసాయ కూలీగా మారిన స్టార్ హీరోయిన్

విరాటపర్వం సినిమాలో తన పాత్ర కోసం సాయి పల్లవి చాలా కష్టపడిందని ఆయన అన్నారు. ఒక సన్నివేశంలో తన పాత్రలోని ఇంటెన్సిటీని చూపించేందుకు ఆ రోజు మొత్తం సాయి పల్లవి ఏం తినకుండానే ఉందని.. అలా చేసి తన క్యారెక్టర్‌లో లీనమై చేసిన పర్ఫార్మెన్స్ చిత్ర యూనిట్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల కాలంలో సినిమాలోని తమ పాత్ర కోసం ఇంతలా డెడికేషన్ చూపించిన వారు లేరని.. సాయి పల్లవిలో మాత్రమే తాను ఇలాంటి డెడికేషన్ చూశానని చిత్ర దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇక విరాటపర్వం సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తుండగా, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.