Sai Pallavi: సాయిపల్లవి భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా!

ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించిన హీరోయిన్ సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాది అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ.. యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా మారుతున్న సాయిపల్లవి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సిద్దమవుతుంది.

Sai Pallavi: సాయిపల్లవి భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా!

Sai Pallavi (Image:Instagram)

Updated On : August 1, 2021 / 11:58 AM IST

Sai Pallavi: ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించిన హీరోయిన్ సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాది అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ.. యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా మారుతున్న సాయిపల్లవి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సిద్దమవుతుంది. ఇప్పటికే తెలుగు, తమిళ బాషలలో తెరకెక్కే ఓ భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఒకే చెప్పినట్లుగా తెలుస్తుంది.

గౌతమ్ రామ చంద్రన్ దర్శకత్వంలో విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. తెలుగు, తమిళ బాషలలో తెరకెక్కనున్న ఈ సినిమాను హిందీకి దబ్ చేసి విడుదల చేయనున్నారట. ఈ సినిమాతో సాయి పల్లవి క్రేజ్ మరింత పెరగడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది.

కాగా, సాయిపల్లవి నటించిన రెండు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా మూడవ సినిమా కూడా చివరి దశలో ఉంది. రానాతో నటించిన విరాట పర్వం, నాగచైతన్యతో నటించిన లవ్ స్టోరీ విడుదలకు సిద్దంగా ఉండగా నానీ శ్యామ్ సింగరాయ్ షూటింగ్ చివరి దశలో ఉంది. మరో రెండు తెలుగు సినిమాలు చర్చల దశలో ఉండగా ముందుగా దిబాషా సినిమాను మొదలుపెట్టనునట్లు తెలుస్తుంది.