Sai Pallavi : వ్యవసాయ కూలీగా మారిన స్టార్ హీరోయిన్

ప్రస్తుతం షూటింగ్స్ నుండి గ్యాప్ దొరకడంతో సాయి పల్లవి తన ఇంటి వద్ద ఉన్న పొలాల్లోకి వెళ్ళింది. అక్కడి వ్యవసాయ కూలీలతో కలిసి పని చేసింది. అక్కడి వ్యవసాయ కూలీలు అల్లం పంటని బయటకి....

Sai Pallavi : వ్యవసాయ కూలీగా మారిన స్టార్ హీరోయిన్

Sai Pallavi

Updated On : April 3, 2022 / 12:40 PM IST

 

Sai Pallavi :  మన సెలబ్రిటీలు షూటింగ్స్ కి గ్యాప్ వచ్చి సమయం దొరికినప్పుడు తమకి ఇష్టమైన పనులు చేసుకుంటూ గడుపుతారు. కొంతమంది సెలబ్రిటీలు వ్యవసాయం కూడా చేస్తారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా షూటింగ్స్ నుంచి ఖాళీ దొరకడంతో వ్యవసాయం చేస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో బిజీగా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’తో అందరిని మెప్పించింది.

Prabhas : ప్రభాస్‌కి హాలీవుడ్ ఆఫర్?? ఆసియా సూపర్ హీరోగా సినిమా??

ప్రస్తుతం షూటింగ్స్ నుండి గ్యాప్ దొరకడంతో సాయి పల్లవి తన ఇంటి వద్ద ఉన్న పొలాల్లోకి వెళ్ళింది. అక్కడి వ్యవసాయ కూలీలతో కలిసి పని చేసింది. అక్కడి వ్యవసాయ కూలీలు అల్లం పంటని బయటకి తీస్తుండగా సాయి పల్లవి కూడా వారితో చేరి అల్లం పంటని బయటకి తీసింది. రోజంతా వారితో కలిసి పని చేసింది. ఉగాది సందర్భంగా సాయి పల్లవి ఇలా పొలం పనులు చేసింది. పొలంలో ఉన్న కూలీలతో కలిసి ఫోటోలు తీసుకొని, అల్లం పంటతో ఫోటోలు తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సాయి పల్లవి. ఈ ఫోటోలని షేర్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇక నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు సాయి పల్లవిని పొంగుతూ కామెంట్స్ పెడుతున్నారు.