Pooja Kannan : సాయి పల్లవి చెల్లెలు నిశ్చితార్థం వేడుకలు షురూ.. ఫోటోలు వైరల్..
సాయి పల్లవి చెల్లెలు నిశ్చితార్థం వేడుకలు షురూ అయ్యాయి. ఇటీవలే ప్రియుడిని పరిచయం చేసిన పూజ కన్నన్..

Sai Pallavi younger sister Pooja Kannan engagement celebration photos
Pooja Kannan : సాయి పల్లవి సిస్టర్ ‘పూజ కన్నన్’ ఆమె పోలికలతోనే కనిపిస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంటారు. పూజ కూడా గతంలో ఓ తమిళ సినిమాలో నటించారు. అయితే ఆ తరువాత మళ్ళీ ఆమె స్క్రీన్ పై కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూజ.. సాయి పల్లవితో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేస్తుంటారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకు మంచి ఫాలోయింగే ఉంది.
ఇది ఇలా ఉంటే, పూజ ఇటీవల తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ వేశారు. ఆ పోస్టులో పూజ తన ప్రియుడిని పరిచయం చేస్తూ.. “ఇతని పేరు వినీత్. నా సూర్యోదయానికి ఇతను కిరణం లాంటివాడు. స్వార్థం లేకుండా ప్రేమించడం ఎలానో, ప్రేమలో ఓర్పుతో, నిలకడతో ఉండడం ఎలానో వినీతే నేర్పించాడు” అంటూ రాసుకొచ్చారు. అయితే ప్రియుడిని పరిచయం చేసి వారం కూడా కాలేదు అప్పుడే ఎంగేజ్మెంట్ అంటూ ఫోటోలు షేర్ చేశారు.
Also read : Ranbir – Alia : అలియా ఎంకరేజ్ వల్లే.. ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్స్ చేశా.. రణబీర్ కామెంట్స్
View this post on Instagram
పూజ తన ఇన్‌స్టా స్టోరీలో ఎంగేజ్మెంట్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ పిక్స్ లో పూజ చేతికి మెహందీతో కనిపిస్తున్నారు. ఒక ఫొటోలో సాయి పల్లవి కూడా కనిపిస్తున్నారు. మరి ఈ నిశ్చితార్థం వేడుక ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందో అనేది తెలియాల్సి ఉంది. ఇక అక్కకంటే ముందే చెల్లెలు పెళ్లిపీటలు ఎక్కేస్తుండడంతో.. అందరూ ఆమెకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ వస్తున్నారు. తెలుగులో నాగచైతన్యతో కలిసి ‘తాండేల్’ సినిమాలో నటిస్తున్నారు. అటు తమిళంలో శివ కార్తికేయన్ సినిమా కూడా చేస్తున్నారు. ఇది కాకుండా హిందీ రామాయణ మూవీలో కూడా సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. రణబీర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా రామాయణ స్టోరీ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.