Pooja Kannan : అక్కకంటే ముందే పెళ్లిపీటలు ఎక్కేస్తున్న చెల్లెలు.. సాయి పల్లవి సిస్టర్ లవర్‌ ఇతనే..

అక్కకంటే ముందే పెళ్లిపీటలు ఎక్కేస్తున్న చెల్లెలు. సాయి పల్లవి సిస్టర్ పూజ కన్నన్ తన లవర్‌ ని పరిచయం చేశారు.

Pooja Kannan : అక్కకంటే ముందే పెళ్లిపీటలు ఎక్కేస్తున్న చెల్లెలు.. సాయి పల్లవి సిస్టర్ లవర్‌ ఇతనే..

Sai Pallavi younger sister Pooja Kannan introduce her lover

Updated On : January 16, 2024 / 5:15 PM IST

Pooja Kannan : అందం, టాలెంట్ కలగలసి ఉన్న సాయి పల్లవి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తూ తక్కువ చిత్రాల్లోనే నటించినా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆమె పోలికలతోనే కనిపించే సాయి పల్లవి సిస్టర్ ‘పూజ కన్నన్’కి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది.

పూజ కూడా ఓ తమిళ సినిమాలో నటించారు. కానీ ఆ తరువాత మళ్ళీ స్క్రీన్ పై కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అక్కతో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే, తాజాగా పూజ ఓ ఆసక్తికర పోస్ట్ వేశారు. ఆ పోస్టులో పూజ తన ప్రియుడిని పరిచయం చేశారు.

ఒక వీడియో పోస్టు చేస్తూ.. “ఇతని పేరు వినీత్. నా సూర్యోదయానికి ఇతను కిరణం లాంటివాడు. స్వార్థం లేకుండా ప్రేమించడం ఎలానో, ప్రేమలో ఓర్పుతో, నిలకడతో ఉండడం ఎలానో వినీతే నేర్పించాడు. నా క్రైమ్ లో కూడా భాగం పంచుకునే నా ప్రేమ పార్టనర్” అంటూ పూజ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Mahesh Babu : ‘గుంటూరు కారం’ నా లాస్ట్ తెలుగు సినిమా కావొచ్చు.. మహేష్ షాకింగ్ కామెంట్స్..

 

View this post on Instagram

 

A post shared by Pooja Kannan (@poojakannan_97)

ఈ వీడియో చూసిన అభిమానులు.. ఆమెకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. మరికొంతమంది అక్కకంటే ముందే చెల్లెలు పెళ్లిపీటలు ఎక్కేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ బిజీ అవుతున్నారు. తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ ఆ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

ఇక తెలుగులో మరోసారి నాగచైతన్యతో జతకడుతూ ‘తాండేల్’ సినిమాలో నటిస్తున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఆ గ్లింప్స్ అలా కొన్ని సెకన్లు కనిపించి మెస్మరైజ్ చేశారు.