NTR30 : సైఫ్ అలీఖాన్ కన్‌ఫార్మ్.. NTR30 సెట్స్‌లోకి త్వరలో ఎంట్రీ!

NTR30లో విలన్ గా సైఫ్ అలీఖాన్ కన్‌ఫార్మ్ అయ్యాడట. బాలీవుడ్ మీడియా ప్రకారం సైఫ్..

NTR30 : సైఫ్ అలీఖాన్ కన్‌ఫార్మ్.. NTR30 సెట్స్‌లోకి త్వరలో ఎంట్రీ!

Saif Ali Khan is confirmed to play villain role in NTR30

Updated On : April 15, 2023 / 1:30 PM IST

NTR30 : ఎన్టీఆర్, కొరటాల కలయికలో వస్తున్న రెండో చిత్రం NTR30. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు RRR వంటి గ్లోబల్ హిట్టు తరువాత వీరిద్దరూ మళ్ళీ జత కట్టడంతో ఈ మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీని గురించి బాలీవుడ్ మీడియాలో ఒక న్యూస్ గట్టిగా వినిపిస్తుంది.

NTR30 : డబల్ ట్రీట్ సిద్ధం చేస్తున్న ఎన్టీఆర్.. NTR30 పై బాలీవుడ్ సర్కిల్‌లో ఇంటరెస్టింగ్ న్యూస్!

ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మూవీ మూడో షెడ్యూల్ లో సైఫ్ పాల్గొనున్నాడని సమాచారం. త్వరలోనే సైఫ్ గురించి మూవీ టీం అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ అండ్ సైఫ్ ఇద్దరు తలబడుతుంటే ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త కూడా బి-టౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట.

NTR – Allu Arjun : మరో బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్.. రణ్‌వీర్ సింగ్‌ని కాదని!

గతంలో ఆంద్రావాలా సమయంలో ఎన్టీఆర్ ఫాదర్ అండ్ సన్ రోల్ చేశాడు. అయితే ఆ రెండు పాత్రలు ఒకేసారి స్క్రీన్ పై కనిపించలేదు. మరి ఇప్పుడు ఈ డ్యూయల్ రోల్ వార్తలో నిజమెంత ఉందో తెలియదు. కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు, సాబు సిరిల్ వంటి టాలీవుడ్ అగ్ర టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు.