Vey Dharuvey : వెయ్ దరువెయ్.. సాయిరామ్ శంకర్ రీ ఎంట్రీ.. ఎక్స్ క్లుజివ్ ఇంటర్వ్యూ..

ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న 'వెయ్ దరువెయ్' ప్రమోషన్స్ లో భాగంగా సాయి రామ్ శంకర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Vey Dharuvey : వెయ్ దరువెయ్.. సాయిరామ్ శంకర్ రీ ఎంట్రీ.. ఎక్స్ క్లుజివ్ ఇంటర్వ్యూ..

Sairam Shankar special interview in Vey Dharuvey promotions

Vey Dharuvey : టాలీవుడ్ హీరో సాయిరామ్ శంకర్ చాలా లాంగ్ గ్యాప్ తరువాత ‘వెయ్ దరువెయ్’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యషా శివకుమార్ హీరోయిన్ గా నటించగా హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ తో మెరిపించనున్నారు. సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై దేవరాజ్ పోతూరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి రామ్ శంకర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన పలు విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ మీ దగ్గరకి ఎలా వచ్చింది..?
దర్శకుడు నవీన్ రెడ్డి, నిర్మాత దేవరాజ్ పోతూరు కలిసి ఓ సినిమా చేయాలని ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తరువాత.. కార్తీక్ అనే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నన్ను కలిశారు. అలా ఈ సినిమా నా దగ్గరకి వచ్చింది.

‘వెయ్ దరువెయ్’ అనే మాస్ టైటిల్ ని పెట్టారు. దానికి తగ్గట్లు సినిమా ఉంటుందా..?
సినిమా టైటిల్ కి తగ్గట్లు గానే ఉంటుంది. అలాగే సమాజంలో ఓ సమస్యని కూడా వేలెత్తి చూపించే సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది.

ట్రైలర్‌లో మీ పాత్ర చూస్తుంటే జోవియల్‌గా ఉంటూ ‘బంపర్ ఆఫర్’ మూవీలోని పాత్రని గుర్తు చేసింది.
‘బంపర్ ఆఫర్’ మూవీ నా బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లు ఉండే చిత్రం. ఆ తర్వాత ఈ కథ నాకు అలా అనిపించింది. కామెడీ నాకు బాగా ఇష్టం. హీరో క్యారెక్టర్ చాలా జోవియల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో 80 శాతం కామెడీ, చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉంటుంది.

Also read : Tamil Directors : తమ తప్పుని భలే కవర్ చేస్తున్న తమిళ్ డైరెక్టర్స్.. ఆడియన్స్‌ని ఫూల్స్ చేస్తున్నారా..!

2017 తరువాత మళ్ళీ మరో సినిమా చేయడానికి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు..?
అందుకు కారణం మధ్యలో కోవిడ్ చాలా బాగా డిస్ట్రబ్ చేసేసింది. అలా కొన్ని పరిస్థితులతో కాస్త గ్యాప్ కనిపిస్తుంది. ప్రస్తుతం నేను వరుస సినిమాలు చేస్తున్నాను. అవన్నీ రిలీజ్‌కి కూడా సిద్ధమవుతున్నాయి. మార్చి 15న ‘వెయ్ దరువెయ్’ రిలీజ్ అయితే, వచ్చే నెలలో ‘ఒక పథకం ప్రకారం’, మే నెలలో ‘రీసౌండ్’ రిలీజ్ అవుతుంది. ఈ మూడు మూవీస్ చేయటానికి ఐదేళ్ల సమయం పట్టింది.

‘వెయ్ దరువెయ్’ తెరకెక్కించడానికి ఎంత సమయం పట్టింది..?
ఈ మూవీని కేవలం 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అందుకు కారణం దర్శకుడు నవీన్ రెడ్డి, నిర్మాత దేవరాజ్ పోతూరుగారి ప్లానింగ్. ఇందులో నాలుగు పాటలు, ఫైట్స్ ఉన్నప్పటికీ అంత త్వరగా పూర్తి చేయటానికి వారు ముందు చేసుకున్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు అందరూ ఇచ్చిన సపోర్ట్ అనే చెప్పాలి.

ఈ సినిమా మీకు మంచి కమ్‌బ్యాక్ ఇస్తుంది అనుకుంటున్నారా..?
ఆడియెన్స్‌ను సినిమా ఎంగేజ్ చేస్తే చాలు. సినిమా సక్సెస్‌ను వాళ్లే డిసైడ్ చేస్తారు. ఫార్మేట్‌లతో వాళ్లకు సంబంధం ఉండదు. ఇక దర్శకుడు నవీన్ కూడా నాకు ఏ కథనైతే చెప్పారో అదే సినిమాగా తెరకెక్కించారు. నా బాడీలాంగ్వేజ్‌కి సూట్ అయ్యే క్యారెక్టర్ ని బాగా చేశాను. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నాకు టేకాఫ్‌కి ఉపయోగపడే సినిమా అవుతుందనిపిస్తుంది.

పుష్ప సినిమాలో విలన్ గా మెప్పించిన సునీల్ మీ సినిమాలో విలన్ గా చేయడం పట్ల మీ కామెంట్స్..?
సునీల్ గరే మా మెయిన్ విలన్. ఆయన బిజీగా ఉన్నప్పటికీ నేను స్పెషల్ గా వెళ్లి కలవటంతో డేట్స్ అడ్జస్ట్ చేసిచ్చారు. ఆయనతో పాటు చాలా మంది స్టార్ యాక్టర్స్ నటించారు. సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, థర్టీ ఇయర్స్ పృథ్వీ, పోసాని, అదుర్స్ రఘు, కాశీ విశ్వనాథ్ అందరూ తమదైన నటనతో మెప్పిస్తారు.

హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతుంది..?
ఈ సినిమాలో మా ఇద్దరిది యాట్యిట్యూడ్ ఉన్న పాత్రలు. యశ పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే హెబ్బా పటేల్ గారు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు.

భీమ్స్ సంగీతం గురించి..?
ఆయన మంచి సాంగ్సే ఇవ్వడమే కాదు. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ను కూడా అందించారు. సినిమాకి చాలా ప్లస్ అవుతుంది.

ఇతర వ్యాపారంలో బిజీగా ఉన్న నిర్మాత ఈ సినిమా ప్రొడక్షన్ లో ఎంతవరకు పాల్గొన్నారు..?
నిర్మాత దేవరాజ్‌ గారికి ఇతర వ్యాపారాలు ఉన్నప్పటికీ సినిమాలంటే ప్యాషన్. ఈ ఆసక్తితోనే దర్శకుడితో ముందు నుంచి ట్రావెల్ అవుతూ వచ్చారు. ఆయనతో కలిసి ముందుగానే మంచిగా ప్లాన్ చేసుకున్నారు. సినిమాను ఇంత త్వరగా పూర్తి చేశామంటే అది దేవరాజ్ గారు తీసుకున్న చొరవే.

‘బంపర్ ఆఫర్ 2’ అనౌన్స్ చేసారు కదా. అది ఎప్పుడు వస్తుంది..?
‘బంపర్ ఆఫర్ 2’ను ఎప్పుడో అనౌన్స్ చేస్తాం. తప్పకుండా సినిమా ఉంటుంది. కరోనా వేవ్స్ సమయంలో సినిమాను ఆపాం. త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేసే అశోక్ గారు కథను తయారు చేశారు. దాన్ని ఆయన ఇంకెవరికీ ఇవ్వను మీకే ఇస్తానని అన్నారు.

మీ అన్నయ్య పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మిమ్మల్ని మళ్ళీ చూసే అవకాశం ఉందా..?
అన్నయ్యను నాతో సినిమా చేయాలని ఇబ్బంది పెట్టాను. వీడికి ఇది అవసరం అనుకుంటే ఆయనే చేస్తారు. ప్రమోషన్స్ విషయంలోనూ అంతే.