Tamil Directors : తమ తప్పుని భలే కవర్ చేస్తున్న తమిళ్ డైరెక్టర్స్.. ఆడియన్స్‌ని ఫూల్స్ చేస్తున్నారా..!

తమ తప్పుని కవర్ చేస్తూ ఆడియన్స్‌ని ఫూల్స్ చేస్తున్న తమిళ్ డైరెక్టర్స్. మొన్న లోకేష్ కనగరాజ్, పి వాసు, ఇప్పుడు ఐశ్వర్య రజినీకాంత్.

Tamil Directors : తమ తప్పుని భలే కవర్ చేస్తున్న తమిళ్ డైరెక్టర్స్.. ఆడియన్స్‌ని ఫూల్స్ చేస్తున్నారా..!

Tamil Directors try to make audience fool by covering their mistakes

Tamil Directors : తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరు దర్శకులు ఈమధ్య కాలంలో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి.. ఆ సినిమాల రిజల్ట్స్ అటుఇటు అవ్వగానే ఒక చిన్న స్టేట్‌మెంట్ ఇచ్చి తమ తప్పుని భలే కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరంటే.. లోకేష్ కనగరాజ్, పి వాసు, ఐశ్వర్య రజినీకాంత్.

దళపతి విజయ్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మోస్ట్ హైపెడ్ మూవీ ‘లియో’. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం.. భారీ ఓపెనింగ్స్ తో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టినప్పటికీ, ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. ముఖ్యం సినిమాలోని సెకండ్ హాఫ్ ఆడియన్స్ కి బోర్ కొట్టించింది. ఇక ఈ విషయానే లోకేష్ ని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. ‘సెకండ్ హాఫ్ లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ ఫేక్ అయ్యి ఉండొచ్చు’ అంటూ కవర్ చేస్తూ మాట్లాడారు.

ఇక రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమా ‘చంద్రముఖి’కి సీక్వెల్ గా దర్శకుడు పి వాసు.. రాఘవ లారెన్స్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘చంద్రముఖి 2’. గత ఏడాది రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఇక ఈ మూవీ రిజల్ట్ పై వాసు మాట్లాడుతూ.. ‘సినిమాకి సంబంధించిన 480 షాట్స్ పోయాయి’ అని చెప్పుకొచ్చారు.

Also read : Kiran Abbavaram : నిశ్చితార్థ వేడుకలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ సంతోషం.. ఫొటోలు

తాజాగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన ‘లాల్ సలామ్’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ రిజల్ట్ గురించి ఐశ్వర్య మాట్లాడుతూ.. “సినిమాలోని ముఖ్యమైన ఫుటేజ్‌ అయినా క్రికెట్ మ్యాచ్ సీన్స్ పోయాయని, దాదాపు 21 రోజుల షూటింగ్ చేసిన ఆ ఫుటేజ్‌ అంతా పోయింది” అంటూ చెప్పుకొస్తూ తమ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా సినిమా రిజల్ట్ లో తమ తప్పేమి లేదని చెప్పుకోవడానికి.. వీళ్లు చెబుతున్న రీజన్స్ ఆడియన్స్ ని ఫూల్స్ చేసేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ వారు చెప్పిన కారణాలు నిజమైనప్పటికీ.. రిలీజ్ చేసే ముందు తెలిసే చేస్తున్నారుగా. అలా చూసుకున్నా దర్శకులదే తప్పు కనిపిస్తుంది. మరి రానున్న సినిమాల రిజల్ట్స్ తమిళ్ దర్శకులు బెటర్ రీజన్స్ అన్న చెబితే బెటర్.