Salaar : జాతకం చూసి ‘సలార్’ని రిలీజ్ చేస్తున్నాము.. నిర్మాత విజయ్ కిరంగదూర్
సలార్ రిలీజ్ డేట్, ఉగ్రమ్ మూవీకి రీమేక్ విషయాలు పై నిర్మాత విజయ్ కిరంగదూర్ కామెంట్స్ ఏంటంటే..?

Salaar producer Vijay Kirgandur about release date and remake of Ugramm news
Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. నిజానికి ఈ చిత్రం సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్టుపోన్ చేసి డిసెంబర్ కి తీసుకు వచ్చారు. ఈ కొత్త విడుదల తేదీలో సలార్ సినిమాతో పాటు షారుఖ్ ఖాన్ ‘డంకీ’, హాలీవుడ్ మూవీ ‘అక్వామన్’ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఆశకు సలార్ మూవీ టీం ఎందుకు పోస్టుపోన్ చేశారు అనేది మాత్రం ప్రశ్న గానే ఉంది.
తాజాగా ఈ ప్రశ్నకు సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ బదులిచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ.. “మేము జాతకాలు బాగా నమ్ముతాము. దశాబ్దం కాలంగా మేము అనుసరిస్తున్న పద్ధతిలోనే సలార్ రిలీజ్ డేట్ ని కూడా ఎంపిక చేశాము” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే సలార్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం ‘ఉగ్రమ్’ రీమేక్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు పై కూడా నిర్మాత స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
Also read : Devil Trailer : కళ్యాణ్ ‘డెవిల్’ ట్రైలర్ రిలీజ్.. బ్రిటిష్ రూలింగ్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్..
ఉగ్రమ్, కేజీఎఫ్, సలార్.. ఇలా ప్రతిదానిని ప్రశాంత్ నీల్ భిన్నంగా తెరకెక్కిస్తూనే వస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా వేగం పెంచినట్లు తెలియజేశారు. రేపు మూవీ నుంచి ‘సూరీడే’ అనే సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మరో యాక్షన్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ‘A’ సర్టిఫికెట్ తో 2 గంటల 55 నిమిషాల 22 సెకన్ల రన్‌టైమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.