Devil Trailer : కళ్యాణ్ ‘డెవిల్’ ట్రైలర్ రిలీజ్.. బ్రిటిష్ రూలింగ్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్..

కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తూ చేస్తున్న సినిమా 'డెవిల్'. నేడు ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Devil Trailer : కళ్యాణ్ ‘డెవిల్’ ట్రైలర్ రిలీజ్.. బ్రిటిష్ రూలింగ్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్..

Kalyan Ram Samyuktha Menon Devil movie Trailer released

Updated On : December 12, 2023 / 5:41 PM IST

Devil Trailer : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తూ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని గ్లింప్స్ అండ్ సాంగ్ రిలీజ్‌లతో నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా నేడు ఈ మూవీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

ఒక రాజకుటుంబానికి సంబంధించిన అమ్మాయి హత్య చేయబడుతుంది. దానిని పరిశోదించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ స్పెషల్ ఏజెంట్ అయిన డెవిల్ అని అక్కడికి పంపిస్తుంది. అయితే డెవిల్ ని అక్కడికి తీసుకు రావడానికి మరో కారణం కూడా ఉంటుంది. టైగర్ హంట్ పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ ని డెవిల్ చేత బ్రిటిష్ ఆఫీసర్స్ ప్లాన్ చేస్తారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ట్రైలర్ లోని విజువల్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి. బ్రిటిష్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్ అనే కాన్సెప్ట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. దీంతో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Also read :Naatu Naatu : నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.. పిక్ వైరల్

అభిషేక్ నామా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 29న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇండియన్ అయినప్పటికీ బ్రిటీష్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఈ రెండు విషయాలను ఎలివేట్ చేసేలా ఆయన కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. కాస్ట్యూమ్ లో భార‌తీయ‌త చూపిస్తూ సినిమాలో కళ్యాణ్ రామ్ తో దాదాపు 90 కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించారట.