Salman Khan : మొన్న మిస్ అయింది.. ఈసారి మిస్ అవ్వదు.. దిల్ రాజు సినిమా గురించి సల్మాన్ భాయ్ ట్వీట్ వైరల్..
మొత్తం టాలీవుడ్, సౌత్ టీమ్ తో సల్మాన్ ఖాన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. (Salman Khan)
Salman Khan
Salman Khan : బాలీవుడ్లో ఈద్ ఫెస్టివల్‌కి ఎవరొచ్చినా రాకున్నా తన సినిమాలతో అభిమానుల ముందుకొస్తుంటారు సల్మాన్ ఖాన్. అలాంటి భాయిజాన్ నుంచి ఈ ఏడాది రంజాన్‌కి ఎలాంటి తోఫా లేకపోవడంతో డిజప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో దిల్ రాజు నిర్మాణంలో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కి జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది.
మొత్తం టాలీవుడ్, సౌత్ టీమ్ తో సల్మాన్ ఖాన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందుకొచ్చేది ఎప్పుడో రివీల్ చేశారు మేకర్స్. రిలీజ్‌కి ఎక్కువ రోజులు పడుతుందని నిరాశ పడొద్దు, అభిమానుల ఎదురుచూపులకు తగినట్లే ఈ మూవీ ఉంటుంది, ఈద్ పండక్కి వచ్చి అందర్నీ మెప్పిస్తుందని ఇంట్రస్టింగ్ ట్వీట్‌తో అంచనాలు పెంచేశారు సల్మాన్ ఖాన్.
Also Read : Rashi Singh : ముంబై బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. నీలిరంగు డ్రెస్‌లో మెరిసిపోతూ..
రీసెంట్‌గానే గ్రాండ్ పూజా కార్యక్రమంతో పట్టాలెక్కింది సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్. దిల్ రాజు బ్యానర్‌పై SVC63 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు సల్మాన్ అభిమానులు. ఈ ఏడాది ఈద్‌కి మాతృభూమి రిలీజ్ విషయంలో ఫ్యాన్స్‌కి తోఫా ఇవ్వలేకపోయారు సల్మాన్ ఖాన్. మాతృభూమి సెన్సార్ పరంగా ముందుకు వెళ్లకపోవడం ఇండియన్ మినిస్టరీ ఆఫ్ డిఫెన్స్ సూచనలతో దాదాపు 40 శాతం సినిమా రీషూట్ అయ్యిందనే ప్రచారంతో మాతృభూమి విడుదల ఎప్పుడనేది క్లారిటీ లేకుండా పోయింది.
సల్మాన్ సినిమాలు ఈద్‌కి థియేటర్స్‌లోకి వస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. 2009 వాంటెడ్, 2010 దబాంగ్, 2011 బాడీగార్డ్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌తో హ్యాట్రిక్ ఈద్ హీరో అనిపించుకున్నారు సల్మాన్. అలాగే 2012 ఏక్ థ టైగర్, 2015 భజరంగీ భాయ్ జాన్, 2016 సుల్తాన్ సినిమాలతో ఇదే సక్సెస్ ఫీట్ రిపీట్ చేశారు భాయిజాన్. అయితే 2019 భరత్, 2023 కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌తో పాటు లాస్ట్ ఇయర్ వచ్చిన సికిందర్ సినిమాలు మాత్రం ఈద్ రోజే రిలీజైనా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. మరి వంశీ పైడిపల్లి సినిమాతో 2027 ఈద్‌ని టార్గెట్ చేస్తోన్న సల్మాన్ ఖాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
Also Read : Kiara Advani : పెళ్లయి పాప పుట్టిన తర్వాత కూడా.. అదిరిపోయే ఫోజులతో బాలీవుడ్ భామ..
Thoda durr ki sochna chahiye, That’s why announced Eid….. Don’t worry iss wali ka bhi bataenge, when the time is right……
Patience, thoda sa sabar……
Mere Jitna he intezar karna padega,
Baherhaal jo apka haal hai wo hi mera bhi haal hai…. haha 🙏#Nayanthara… pic.twitter.com/nMGrfOj3DF— Salman Khan (@BeingSalmanKhan) April 24, 2026
