Tiger 3 : తెలుగులో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ కొత్త తరహా ప్రమోషన్స్.. న్యూస్ పేపర్‌లో రికార్డర్..

టైగర్ 3 సరికొత్త ప్రమోషన్స్. న్యూస్ పేపర్ లో రికార్డర్ తో టైగర్ 3 మ్యూజిక్ అండ్ డైలాగ్ ప్రమోషన్స్..

Tiger 3 : తెలుగులో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ కొత్త తరహా ప్రమోషన్స్.. న్యూస్ పేపర్‌లో రికార్డర్..

Salman Khan Katrina Kaif Tiger 3 crazy promotions in tollywood

Tiger 3 : సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా సిరీస్ ‘టైగర్’ నుంచి మూడో భాగం ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. టైగర్ 1, టైగర్ 2 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కత్రినా కైఫ్.. ఈ సినిమాలో కూడా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. హిందీతో పాటు తెలుగు తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని తెలుగులో సరికొత్తగా నిర్వహిస్తున్నారు. న్యూస్ పేపర్ లో రికార్డర్ తో ప్రమోషన్స్.

డైలీ వచ్చే న్యూస్ పేపర్ లో ఒక సౌండ్ రికార్డర్ ని పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ పేపర్ ఓపెన్ చేసిన తరువాత.. ఆ సౌండ్ రికార్డర్ ఆన్ అయ్యి.. టైగర్ 3 మ్యూజిక్ అండ్ డైలాగ్ వస్తుంది. ఈ సరికొత్త ప్రమోషన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ న్యూస్ పేపర్ ప్రమోషన్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ప్రమోషన్ ని చూసిన ప్రజల రియాక్షన్ ఏంటో ఒక లుక్ వేసేయండి.

Also read : Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి.. ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ.. ఎనిమిది కోట్లకు హక్కులు ఇచ్చారన్న..

కాగా ఈ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తుంది. ఈ ఏడాది సూపర్ హిట్టుగా నిలిచిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ‘టైగర్’గా ఎంట్రీ ఇచ్చి.. ఈ యూనివర్స్ ని ఓపెన్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ టైగర్ 3లో షారుఖ్ ఖాన్ పఠాన్ గా గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నాడు. దీంతో సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మనీష్ శర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా నవంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.