Salman Khan : పఠాన్ సినిమా నా వల్ల హిట్ అవ్వలేదు.. ఆ క్రెడిట్ వాళ్ళకే..

పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సినిమాకు మరింత ప్లస్ అయ్యాడు. పఠాన్ సినిమా హిట్ అవ్వడానికి సల్మాన్ ఖాన్ కూడా ఒక కారణం.

Salman Khan : పఠాన్ సినిమా నా వల్ల హిట్ అవ్వలేదు.. ఆ క్రెడిట్ వాళ్ళకే..

Salman Khan said i am not reason for pathaan success

Updated On : April 30, 2023 / 7:08 AM IST

Salman Khan :  షారుఖ్ ఖాన్(Shahrukh Khan), దీపికా(Deepika Padukone) జంటగా, జాన్ అబ్రహం(John Abraham) విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్(Siddarth Anand) దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్(Pathaan) సినిమా మంచి విజయం సాధించి, చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కెల్క్షన్స్ సాధించింది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత సంవత్సర కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్(Bollywood) కి పెద్ద విజయాన్ని అందించాడు. ఈ సినిమా దాదాపు 1030 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సినిమాకు మరింత ప్లస్ అయ్యాడు. అంతే కాక స్పై యూనివర్స్ సినిమాలకు లైన్ క్లియర్ చేశాడు. పఠాన్ సక్సెస్ ని బాలీవుడ్ అంతా సెలబ్రేట్ చేసుకుంది. భవిష్యత్తులో కూడా పఠాన్ వర్సెస్ టైగర్ అంటూ షారుఖ్, సల్మాన్ ఖాన్ మళ్ళీ కలిసి నటించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ పఠాన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పఠాన్ సినిమా హిట్ అవ్వడానికి సల్మాన్ ఖాన్ కూడా ఒక కారణం. ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే ప్రస్తావించగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. అస్సలు కాదు. పఠాన్ సక్సెస్ కి నేను కారణం కాదు. ఆ క్రెడిట్ అంతా షారుఖ్, నిర్మాత ఆదిత్య చోప్రాలకే దక్కుతుంది. షారుఖ్, అతని ఫ్యాన్స్ మంచి సక్సెస్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అది కరెక్ట్ టైంలో పఠాన్ సినిమాతో వచ్చింది అంతే. ఆ సినిమా సక్సెస్ కు నేను ఏ మాత్రం కారణం కాదు అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై షారుఖ్, సల్మాన్ అభిమానులు ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.