Salman Khan : జైలులో టాయిలెట్స్ కూడా కడిగాను.. వైరల్ అవుతున్న సల్మాన్ వ్యాఖ్యలు..

ఫైనల్ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్ ఫైనలిస్టుల్లో పూజ భట్ అనే కంటెస్టెంట్ ని అభినందిస్తూ హౌస్ నీలాగా క్లీన్ గా ఎవరూ ఉంచలేరు. టాయిలెట్స్ కూడా మొహమాటపడకుండా కడిగావు. నేను కూడా అలాగే చేశాను.

Salman Khan : జైలులో టాయిలెట్స్ కూడా కడిగాను.. వైరల్ అవుతున్న సల్మాన్ వ్యాఖ్యలు..

Salman Khan says he cleaned toilets in Jail comments in Bigg Boss Show

Salman Khan : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే యాడ్స్, టీవీ షోలు కూడా చేస్తున్నాడు. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss) కి గత కొన్నేళ్లుగా సల్మాన్ హోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఓటీటీ బిగ్‌బాస్ కి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నారు. తాజాగా హిందీ ఓటీటీ బిగ్‌బాస్ షో పూర్తయింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సారి బిగ్‌బాస్ ట్రోఫీ సాధించాడు.

అయితే ఫైనల్ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్ ఫైనలిస్టుల్లో పూజ భట్ అనే కంటెస్టెంట్ ని అభినందిస్తూ హౌస్ నీలాగా క్లీన్ గా ఎవరూ ఉంచలేరు. టాయిలెట్స్ కూడా మొహమాటపడకుండా కడిగావు. నేను కూడా అలాగే చేశాను. నేను చదువుకునేటప్పుడు బోర్డింగ్ స్కూల్ లో టాయిలెట్స్ క్లీన్ చేశాను. ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా టాయిలెట్స్ క్లీన్ చేశాను. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు. ఏ పని తక్కువ కాదు. అందుకు మనం బాధపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.

Bholaa Shankar : భోళా శంకర్ తెలుగులో అయిపోయింది.. హిందీలో రిలీజ్‌కి రెడీ.. మెగాస్టార్‌కి డబ్బింగ్ ఎవరో తెలుసా?

దీంతో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సల్మాన్ కృష్ణజింకని చంపిన కేసులో గతంలో జైలుకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.