రవివర్మ అందాలే: కుంచె నుంచి వచ్చినట్లుగానే సమంత, రమ్యకృష్ణ,శ్రుతీహాసన్ కేలండర్ షూట్

  • Published By: vamsi ,Published On : February 4, 2020 / 07:09 AM IST
రవివర్మ అందాలే: కుంచె నుంచి వచ్చినట్లుగానే సమంత, రమ్యకృష్ణ,శ్రుతీహాసన్ కేలండర్ షూట్

Updated On : February 4, 2020 / 7:09 AM IST

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అంటూ పాడాడు ఓ కవి.. రవి వర్మ కాంచని అందాలు.. కెమెరా కళ్లు కాంచాయి. మూగభావాలలో.. అనురాగ యోగాలై.. కావ్య కల్పనలే.. నీ దివ్య శిల్పాలై అంటూ రవివర్మ పెయింటింగ్‌ల గురించి గొప్పగా చెబుతారు కదా? వాటిని రీ క్రియేట్ చెయ్యలేరు అనేది కూడా అంతే వాస్తవం అయితే మన హీరోయిన్లను రవివర్మ గీసిన బొమ్మల్లా మార్చేశారు ఓ ఫోటో గ్రాఫర్. 

జీ వెంకట్ అనే ఫోటో గ్రాఫర్ ఆ రవివర్మ అందాలను తన ప్రతిభతో రీ క్రియేట్ చేశారు. 19వ శాతాబ్ధంలో రవివర్మ అందించిన అందాలను రవివర్మ 2020 పేరుతో అందించారు. ఓ కేలండర్ కోసం వీరంతా రవివర్మ గీసిన బొమ్మాల్లా మారి ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రవి వర్మ గీసిన అందాల రూపంలో వారి ఫోటోలు చూడడానికి ఎంతో బాగున్నాయి.

నటి సుహాసిని అద్వర్యంలో సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌లు అచ్చం రవి వర్మ కుంచే నుంచి జాలువారిన అందాల మాదిరిగానే ఉన్నారు. 

రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా సమంత..

రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా శృతిహాసన్…

రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా ఐశ్వర్య రాజేష్..

రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా రమ్య కృష్ణ..

రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా ఖుష్బూ సుందర్..

రాజా రవివర్మ చిత్రంలో మాదిరిగా మంచు లక్ష్మి..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

MANCHU LAKSHMI #ravivarmapaintings #manchulakshmi #potrait #venketramg

A post shared by Hyderabad Calling? (@hyderabadcalling) on