Samantha : మళ్ళీ సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సమంత.. అధికారికంగా అనౌన్స్..
సమంత మళ్ళీ సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. (Samantha)
Samantha
Samantha : స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత కొన్నాళ్ల క్రితం తన ఆరోగ్య సమస్యలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల గ్యాప్ తర్వాత తన హెల్త్ సెట్ అయ్యాక మొదట నిర్మాతగా వచ్చి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమా మా ఇంటి బంగారంతో వచ్చి విజయం సాధించింది. దీంతో సమంత కంబ్యాక్ ఇచ్చింది, మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తుందని ఫ్యాన్స్ ఆశించారు.
అయితే సమంత మళ్ళీ సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. నేడు జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని తెలిపింది సమంత. సమంత రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత ప్రగ్నెంట్ అయిందని ఇటీవలే మా ఇంటి బంగారం రిలీజ్ అయ్యాక హింట్ ఇచ్చింది.
Also Read : Shanmukh Jaswanth : పెళ్లయిన మూడు రోజులకే హాస్పిటల్ లో చేరిన షణ్ముఖ్ జస్వంత్.. ఫోటో వైరల్..
నేడు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. నేను మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నాను. సారీ మళ్ళీ చిన్న గ్యాప్ ఇస్తున్నాను సినిమాలకు. మళ్ళీ త్వరలోనే వస్తాను. కానీ చాలా ఆనందంగా ఉన్నాను ఈ విషయంలో అని తెలిపింది. దీంతో సమంత ఈజీగా ఓ రెండేళ్లు మళ్ళీ సినిమాలకు గ్యాప్ ఇస్తుందని తెలుస్తుంది. సమంత అధికారికంగా తన ప్రగ్నెన్సీ గురించి చెప్పడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
#Samantha confirmed her pregnancy and revealed that she will be taking a brief maternity break from films🤝pic.twitter.com/wjjuJjTceS
— AmuthaBharathi (@CinemaWithAB) June 24, 2026
