Samantha : రిస్కీ షాట్స్.. డూప్ లేకుండా సమంత సాహసం..
మా ఇంటి బంగారం లో నటించిన రచన అనే నటి ఓ ఇంటర్వ్యూలో సమంత యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడింది. (Samantha)
Samantha
Samantha : సమంత మా ఇంటి బంగారం సినిమాతో జూన్ 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న మహిళ ఓ సాంప్రదాయ కుటుంబానికి కోడలిగా వస్తే ఏం జరిగింది అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో సమంత అనేక యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చేసింది. మా ఇంటి బంగారం లో నటించిన రచన అనే నటి ఓ ఇంటర్వ్యూలో సమంత యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడింది.
రచన మాట్లాడుతూ.. ఈ సినిమాలో డూప్ లేకుండానే సమంత అన్ని ఫైట్స్ చేసింది. ఫైట్ మాస్టర్ చెప్పింది విని చేయడానికి రెడీ అయిపోతుంది. కొన్ని రిస్కీ షాట్స్ కూడా ఉన్నాయి. చూడటానికే రిస్కీగా అనిపిస్తాయి. కానీ తను ఎలా చేసిందో చేసేసింది. సినిమాలో చూస్తే మీకే అర్ధమవుతుంది అని తెలిపింది.
Also Read : Kriti Sanon : కాక్ టైల్ 2 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కృతి సనన్.. సినిమాలో ఓ రేంజ్ అందాల ఆరబోత..
దీంతో మా ఇంటి బంగారం సినిమాలో సమంత ఎలాంటి డూప్ లేకుండా తనే యాక్షన్ సీక్వెన్స్ లను స్వయంగా చేసిందని తెలుస్తుంది. మరి సమంత ఫైట్స్ ఎలా ఉన్నాయో తెరపై చూడాలి.
