Samantha : అప్పుడే అమెరికాలో వర్కౌట్లు మొదలుపెట్టేసిన సమంత.. న్యూయార్క్ గాలిలో ఏదో ఉంది..

సమంత అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, పోస్టులు ఏదో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. అమెరికా న్యూయార్క్ వెళ్లి మొదటి రోజే సిటీ అంతా తిరిగేసింది.

Samantha : అప్పుడే అమెరికాలో వర్కౌట్లు మొదలుపెట్టేసిన సమంత.. న్యూయార్క్ గాలిలో ఏదో ఉంది..

Samantha landed in America enjoying at New York and doing workouts

Samantha :  సినిమాలకు కొన్నాళ్ళు గ్యాప్ ప్రకటించిన సమంత తన మయోసైటిస్ సమస్య పూర్తిగా తగ్గేవరకు హెల్త్ మీద బాగా ఫోకస్ చేయాలని ఫిక్స్ అయింది. అలాగే ట్రీట్మెంట్ కోసం అమెరికా కూడా వెళ్ళింది. సమంత నటించిన ఖుషి సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ వరకు కూడా ఉండకుండా రెండు రోజుల క్రితం తన తల్లితో కలిసి సమంత అమెరికా వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించిన సామ్ ఇప్పుడు న్యూయార్క్ లో చక్కర్లు కొడుతుంది.

సమంత అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, పోస్టులు ఏదో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. అమెరికా న్యూయార్క్ వెళ్లి మొదటి రోజే సిటీ అంతా తిరిగేసింది. అమెరికాలో సమంత తిరిగిన ప్రదేశాలను ఫొటోలుగా పోస్ట్ చేసింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర దిగిన ఫొటో, తన జిమ్ వర్కౌట్స్ ఫొటోలు కూడా షేర్ చేసింది. అలాగే తన ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేస్తున్న ఫొటోని షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోలన్నీ షేర్ చేసి న్యూయార్క్ గాలిలో ఏదో స్పెషల్ ఉంది అని క్యాప్షన్ ఇచ్చింది.

Suhas : టాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్య సుహాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. గ్యాలరీ

అమెరికా వెళ్ళగానే వర్కౌట్స్ మొదలుపెట్టేసింది, హెల్త్ మీద బాగానే ఫోకస్ చేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే సమంత అమెరికాలో జరిగే ఇండియన్స్ ఇండిపెండెన్స్ పరేడ్ లో కూడా పాల్గొనబోతుందని సమాచారం.