Samantha : తన బిజినెస్‌లో పార్టనర్‌షిప్ కలిపిస్తూ సమంత బంపర్ ఆఫర్..

స్టార్ హీరోయిన్ సమంత నటిగా, బిజినెస్ ఉమెన్ గా ఒక సక్సెస్ ఫుల్ లేడీగా ఎంతోమందికి ఆదర్శం అవుతుంది. సినిమా రంగంలో సూపర్ సక్సెస్ అయిన సమంత.. 2020లో వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టింది. కాగా ఇప్పుడు తన బిజినెస్ లను ఎక్స్‌పాండ్ చేయడానికి సిద్ధమైంది. అయితే...

Samantha : తన బిజినెస్‌లో పార్టనర్‌షిప్ కలిపిస్తూ సమంత బంపర్ ఆఫర్..

Samantha ekam school

Updated On : February 9, 2023 / 12:55 PM IST

Samantha : స్టార్ హీరోయిన్ సమంత నటిగా, బిజినెస్ ఉమెన్ గా ఒక సక్సెస్ ఫుల్ లేడీగా ఎంతోమందికి ఆదర్శం అవుతుంది. విడాకులు తీసుకున్న చాలా మంది ఆడవాళ్లు జీవితంలో చాలా బలహీనం అయిపోతారు, కానీ సమంత మాత్రం అందరి లాంటి అమ్మాయి కాదు. తనకి ఎదురైన ఈ అనుభవాన్ని ఒక ఛాలంజ్ గా తీసుకోని లైఫ్ లో ముందుకు సాగుతుంది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటికి ఎదురు నిలబడుతూ వస్తుంది. ఇక ఇటీవల అరుదైన వ్యాధి భారిన పడిన సమంత.. దానిని నుంచి కోలుకొని మళ్ళీ వృత్తి పరంగా బిజీ అవుతుంది.

Samantha : అఖిల్ పోస్ట్‌కి సమంత కామెంట్.. అక్కినేని కుటుంబంతో వీడని బంధం!

సినిమా రంగంలో సూపర్ సక్సెస్ అయిన సమంత.. 2020లో వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టింది. హైదరాబాద్ లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటూ ‘ఏకం’ అనే స్కూల్ ప్రారంభించింది, దాని తరువాత అదే ఏడాది క్లాతింగ్ ఇండస్ట్రీ ‘సాకి’లో కూడా భాగ్యస్వామి అయ్యింది. కాగా ఇప్పుడు తన బిజినెస్ లను ఎక్స్‌పాండ్ చేయడానికి సిద్ధమైంది. తన ఏకం స్కూల్స్ ని ఇతర నగరాల్లో కూడా ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కేవలం జ్ఞానం పెరగడానికి మాత్రమే కాదు. చిన్నతనం నుంచే పిల్లల ఆలోచన విధానం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది అనే ఉద్దేశంతో సమంత ఈ స్కూల్ ని ప్రారంభించినట్లు గతంలో తెలియజేసిన సంగతి తెలిసిందే.

అలాంటి మంచి పనిని ఒక నగరంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో జరగాలి అనే ఉద్దేశంతో.. ఫ్రాంఛైజ్ లా ఈ స్కూల్స్ ని ప్రారంభించడానికి సమంత ముందుకు వస్తుంది. అయితే ఈ మంచి పనిలో ఇతరులకు కూడా అవకాశం కలిపిస్తూ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. తనతో కలిసి ఏకం ఫ్యామిలీలో పార్టనర్‌షిప్ ఛాన్స్ ఇస్తూ.. 10-12 రూమ్ లు కట్టేలా ఒక స్థలం ఉండి, పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే మమల్ని కాంటాక్ట్ అవ్వండి అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చింది. మరి మీలో ఎవరికన్నా బిజినెస్ పై ఆసక్తి ఉంటే ఈ ఛాన్స్ ని ఉపయోగించుకొని సమంతతో పార్టనర్స్ అవ్వండి.

 

View this post on Instagram

 

A post shared by Ekam Early Learning Centre (@ekamearlylearning)