Samantha: పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత.. వీడియో చూశారా..?
స్టార్ బ్యూటీ సమంత రీసెంట్ గా ‘శాకుంతలం’ మూవీలో నటించింది. తాజాగా ఆమె పెప్సీ యాడ్ లో కనిపించి అందరికీ షాకిచ్చింది.

Samantha Turns Brand Ambassador For Pepsi
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇటీవల ‘శాకుంతలం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేయగా, మైథలాజికల్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. అయితే, సామ్ యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సామ్ జీవించేసిందని అభిమానులు ప్రశంసలు కురిపించారు.
Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత.. మళ్లీ ఏమైంది?
ఇక ఈ బ్యూటీ, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కోసం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. కాగా, తాజాగా సమంత పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. జనవరిలో తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా కేజీయఫ్ హీరో యష్‌ను పెప్సీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత కూడా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని ఓ యాడ్‌తో పెప్సీ అనౌన్స్ చేసింది. ఈ యాడ్‌లో సమంత యాక్షన్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
Samantha : సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని.. బర్త్ డే రోజు ఓపెనింగ్!
సినిమాలతోనే కాకుండా ఇలా కమర్షియల్ యాడ్స్‌లోనూ సమంత జోరు చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత, ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
View this post on Instagram